RamCharan JrNTR NaatuNaatu Oscars రామ్ చరణ్, ఎన్టీయార్.. అభిమానులేమో, మా హీరో గొప్ప అంటే మా హీరోనే గొప్ప.. అంటూ కొట్టుకుంటున్నారు.
అత్యంత జుగుప్సాకరంగా సోషల్ మీడియా వేదికగా పైత్యం ప్రదర్శిస్తున్నారు అభిమానం మనుసుగేసుకున్న కొందరు దురభిమానులు.
ఆస్కార్‌కి అడుగు దూరంలో ‘ఆర్ఆర్ఆర్’.!
అభిమానానికి వేల మైళ్ళ దూరంలో దురభిమానులు.!
రామ్ చరణ్, ఎన్టీయార్.. ఎన్నిసార్లు తాము అన్నదమ్ములమని నిరూపించుకోవాలి.?
వాళ్ళిద్దరూ అంత సన్నిహితంగా వుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నదెవరు.?
తెలుగు సినిమాకి దక్కుతున్న ఖ్యాతిపై ఎందుకు విషం చిమ్ముతున్నారు.?
ప్రపంచమే ‘ఆర్ఆర్ఆర్’ని కొనియాడుతోంటే, తెలుగునాట కుల పైత్యం ఎందుకింత పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది.?
Mudra369
కానీ, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మాత్రం ఆస్కార్ పురస్కారాల వేటలో దూసుకుపోతోంది.! ఇటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అటు యంగ్ టైగర్ ఎన్టీయార్.. ఇద్దరూ ‘గ్లోబల్ స్టార్స్’గా రూపాంతరం చెందారు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో.
అంతర్జాతీయ వేదికలపై ఇటు రామ్ చరణ్, అటు ఎన్టీయార్.. తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కలిసి కట్టుగా.. చాలా ఉత్సాహంగా ‘ఆర్ఆర్ఆర్’కి దక్కుతోన్న గౌరవాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
RamCharan JrNTR NaatuNaatu Oscars.. ఆస్కార్.. నాటు నాటు..
ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవం సందర్భంగా ‘నాటు నాటు’ పాటని అక్కడే ఆలపించబోతున్నారు సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ.!
ఈ విషయాన్ని నేరుగా ‘అకాడమీ’ ప్రకటించింది. ఇది అత్యంత అరుదైన సందర్భం. తెలుగు సినిమాకి, ఇండియన్ సినిమాకి దక్కిన గౌరవంగా భావించాల్సి వుంటుంది.
‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ పురస్కారాల ప్రదానోత్సవ వేడుకకి హాజరయ్యేందుకు అమెరికా వెళ్ళిన రామ్ చరణ్, ప్రస్తుతం అక్కడే వున్న సంగతి తెలిసిందే.

ఈ నెల 6వ తేదీన జూనియర్ ఎన్టీయార్ కూడా అమెరికా వెళుతున్నాడు. రామ్ చరణ్, ఎన్టీయార్ అలాగే దర్శకుడు రాజమౌళి.. ఇలా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొననుంది.
అభిమానుల కొట్లాట మామూలే..
‘ఆర్ఆర్ఆర్’ బృందమిలా, ఆస్కార్ కోసం ఎదురుచూస్తోంది. యావత్ తెలుగు సినీ పరిశ్రమ, రెండు తెలుగు రాష్ట్రాలు.. ఆ మాటకొస్తే, సగటు భారతీయ సినీ అభిమాని సైతం ఆస్కార్ కోసం ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే.
కానీ, సోకాల్డ్ అభిమానుల ముసుగేసుకున్న కొందరు దురభిమానులు ఎన్టీయార్, రామ్ చరణ్‌లను ట్రోల్ చేస్తూ.. విషం చిమ్ముతున్నారు.
Also Read: ఎన్టీయార్‌కి ‘మెగా’ అవమానం.! బాలయ్యా ఏం చేస్తున్నావ్.?
చిత్రంగా ఓ సెక్షన్ మీడియా ‘ఎవరు గొప్ప.?’ అన్న అంశంపై రామ్ చరణ్, ఎన్టీయార్ అభిమానుల మధ్య పోటీ పెట్టి పబ్బం గడుపుకుంటోంది.!
సోషల్ మీడియాలో అభిమానుల రచ్చ సంగతెలా వున్నాయ.. యావత్ ఇండియన్ సినిమా, ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ పురస్కరారాన్ని అందుకోవాలని కోరుకుంటోంది.
అటు రామ్ చరణ్ కావొచ్చు.. ఇటు ఎన్టీయార్ కావొచ్చు.. ఈ ఇద్దర్నీ పాన్ ఇండియా స్టార్స్‌గా మాత్రమే కాదు, గ్లోబల్ స్టార్స్‌గానూ ఇండియన్ సినిమా గుర్తించింది.
అంతర్జాతీయ సినీ సమాజం సైతం, రామ్ చరణ్ అలాగే ఎన్టీయార్‌లను గ్లోబల్ స్టార్స్‌గా భావిస్తోందాయె.!
నెక్స్‌ట్ లైన్‌లో మహేష్ వున్నాడు.. ప్రభాస్ కూడా ఆ దిశగా అడుగులేస్తున్నాడు.
తెలుగు సినిమా నుంచి ఇంతమంది స్టార్స్.. ప్రపంచ సినిమాపై తమదైన ముద్రవ వేస్తున్న దరిమిలా.. గర్వపడకుండా ఎలా వుండగలం.?