Ramcharan NTR Oscar.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీయార్.. ఈ ఇద్దరూ తమ తమ సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమలో తమదైన స్టార్డమ్ సంపాదించుకున్నారు.
అంతేనా, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఇద్దరికీ జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఇద్దరి పేర్లూ మార్మోగిపోతున్నాయంటే, దానిక్కారణం రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమానే.
నిజానికి, యంగ్ టైగర్ ఎన్టీయార్ కంటే ముందే బాలీవుడ్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చాడు. అది గతం.
ఎవరు తక్కువ.? ఎవరు ఎక్కువ.?
రామ్ చరణ్, ఎన్టీయార్లలో ఎవరు గొప్ప.? అసలు ఈ ప్రశ్నలోనే అర్థం లేదు. ఎవరి స్థాయిలో వారు స్టార్డమ్ సంపాదించుకున్నారు.

‘ఎవరు గొప్ప.?’ అన్న ‘ఆధిపత్య పోరు’ ఈ ఇద్దరిలో వుంటే, అసలు ఇద్దరూ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేసే పరిస్థితే వుండేది కాదు.. ఇద్దరి మధ్యా ఎన్నో ఏళ్ళుగా.. అంటే, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కంటే ముందే స్నేహమూ పుట్టి వుండేది కాదు.!
‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ బరిలో నిలవాలని కోరుకోనివారెవరుంటారు.? తెలుగు సినిమాకి, ఇండియన్ సినిమాకి ఈ అరుదైన ఘనత దక్కుతోందంటే కాదనేవారెవరు.?
ఆ మధ్య ఎన్టీయార్ పేరు ఆస్కార్ రేసులో వుందంటూ వార్తలొచ్చాయి. ఇప్పుడు రామ్ చరణ్ పేరు అలా వార్తల్లోకెక్కింది.
Ramcharan NTR Oscar.. అదంతా హంబక్.!
వాస్తవానికి, ఆ వార్తలేవీ నిజం కావు. ఓ ప్రాబబిలిటీ లిస్టుని ఏదో మ్యాగజైన్ ప్రచారంలోకి తెచ్చిందంతే. నిజానికి, అదీ చిన్న విషయమేమీ కాదు.
రామ్ చరణ్ రేసులో నిలబడతాడా.? ఎన్టీయార్ ఆ ఘనత దక్కించుకుంటాడా.? అంటే, ఈ రెండిటిలో ఏది జరిగినా అద్భుతమే. రెండూ జరగాలని ఎందుకు ఆశించకూడదు.?
Also Read: మెగాస్టార్ చిరంజీవిని ‘బాధితుడు’గా మార్చేసిందెవరు.?
అసలు తెలుగు సినిమాకి ‘ఆస్కార్’ సాధ్యమేనా.? అదిప్పుడు ఆలోచించాల్సిన విషయం. అంతేగానీ, చరణ్ – ఎన్టీయార్ అభిమానుల పేరుతో సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తే ప్రయోజనం లేదు.
పైగా, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం వల్ల తెలుగు సినిమా, తద్వారా ఇండియన్ సినిమా అభాసుపాలైపోతుందని ఆయా హీరోల అభిమానుల ముసుగులో పెంట పెంట చేస్తున్న దురభిమానులు తెలుసుకోవాలి.