Rashmika Deepfake Culprit Arrested.. తీగ లాగితే డొంక కదిలింది.! దొంగ దొరికిపోయాడు.! నేషనల్ క్రష్ రష్మిక మండన్న వీడియో అంటూ ఓ ఫేక్ వీడియోను సృష్టించిన సైబర్ దొంగ పోలీసులకు చిక్కాడు.
కొన్నాళ్ళ క్రితం రష్మిక వీడియో.. అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. మరీ అంత జుగుప్సాకరమైన వీడియో ఏమీ కాదది. కాకపోతే, అది మార్ఫింగ్ వీడియో.
జారా పటేల్ అనే ఓ అమ్మాయి వీడియోకి రష్మిక ఫేస్ తగిలించి మార్ఫింగ్ చేశారు. దాంతో, రష్మిక వీడియోనే.. అని అంతా ఆ వీడియో చూసి నమ్మేశారు.

అంత పెర్‌ఫెక్ట్‌గా ఆ వీడియోను క్రియేట్ చేశారు. కానీ, ఈ డీప్ ఫేక్ క్రియేటివిటీపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగింది.
Rashmika Deepfake Culprit Arrested.. రష్మిక డీప్ ఫేక్‌పై స్పందించిన ప్రముఖులు..
బిగ్-బి అమితాబ్ బచ్చన్ దగ్గరనుంచి చాలామంది సినీ ప్రముఖులు ఈ వీడియోపై స్పందించారు. రష్మిక ఈ వీడియో పట్ల కలత చెంది పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా.
రష్మిక ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు, ‘దొంగ’ కోసం అన్వేషణ షురూ చేశారు. చివరికి దొంగ దొరికాడు. అతని పేరు ఈమని నవీన్.!
Also Read: Malaika Arora: ఆమె ముందు వయసు ఓడిపోయింది.!
ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఈమని నవీన్‌ని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం గమనార్హం.
కాగా, తన వీడియోను రష్మిక (Rashmika Mandanna) ఫేస్‌తో మార్ఫింగ్ చేయడం పట్ల జారా పటేల్ కూడా అప్పట్లో స్పందించింది.
ఇదిలా వుంటే, డీప్ ఫేక్ వ్యవహారంలో జరిగిన అరెస్టు పట్ల రష్మిక హర్షం వ్యక్తం చేసింది. ఓ అమ్మాయి అనుమతి లేకుండా, ఆ అమ్మాయి ఫొటోలు లేదా వీడియోల్ని మార్ఫింగ్ చేయడం నేరమని రష్మిక పేర్కొంది.
రష్మిక మండన్న మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు, సాధారణ మహిళలు కూడా డీప్ ఫేక్ బాధితులుగా మారుతున్నారు.
సినీ నటి రష్మిక (Rashmika Mandanna) కేసులో అరెస్టు తర్వాత, ఈ తరహా నేరాలకు సంబంధించి దోషులు తప్పించుకోలేరన్న బలమైన సంకేతం ఇచ్చినట్లయ్యింది.