Rashmika Mandanna Animal Movie.. నేషనల్ క్రష్ అని ఊరికే గుర్తింపు వచ్చేయలేదు.! రష్మిక అంటే బబ్లీ.. రష్మిక అంటే మాస్.. రష్మిక అంటే క్లాస్.!
‘పుష్ప’తో డీ-గ్లామర్ లుక్‌లోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంది రష్మిక. ‘డియర్ కామ్రేడ్’ సినిమాలోనూ రష్మిక (Rashmika Mandanna) భిన్నమైన పాత్రలోనే కనిపించింది.
అయితే, ‘అంతకు మించి’ అనేలా వుండబోతోందిట ‘యానిమల్’ (Animal) సినిమాలో రష్మిక మండన్న పాత్ర.! నటన పరంగా చూస్తే, రష్మిక రఫ్ఫాడించేస్తుందని అంటున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.
హీరో పాత్ర ఎంత బావుంటుందో, హీరోయిన్ పాత్ర అంతకు మించి వుంటుందనీ, హీరో తండ్రి పాత్ర కూడా వేరే లెవల్ అనీ.. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) చెబుతున్నాడు.
Rashmika Mandanna Animal Movie.. తక్కువా.? ఎక్కువా.?
‘రష్మిక (Rashmika Mandanna) పాత్ర నిడివి తక్కువట కదా..’ అంటూ జరుగుతున్న ప్రచారంపై సందీప్ రెడ్డి వంగా స్పందించాడు.
సినిమా అంతా రష్మిక వుంటుందనీ, ఆమె పాత్ర తాలూకు ప్రభావం, హీరో పాత్రపై చాలా చాలా వుంటుందనీ సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చాడు.

నటిగా రష్మిక అసలు సిసలు పొటెన్షియాలిటీ ఏంటో ఈ సినిమాతో తెలుస్తుందట. అంత బాగా ఆమె పాత్ర డిజైన్ చేయబడితే, అంతకు మించి ఆమె తన నటనతో ఆకట్టుకుంటుందని అంటున్నారు.
Also Read: ప్రేమలో మృణాల్ ఠాకూర్.! అంత పెద్ద తప్పు చేసేసిందా.?
ఇక, రష్మిక – రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) మధ్య లిప్ లాక్ సీన్స్ వల్గర్‌గా వుండవనీ, అవీ కథలో భాగమేనని ఆల్రెడీ ఓ క్లారిటీ వచ్చేసింది.
తాను బరువైన పాత్రనే ‘యానిమల్’ సినిమాలో చేస్తున్నాననీ, ఇలాంటి పాత్రలు నటిగా తనకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెడతాయనే ఈ తరహా పాత్రల్ని ఎంచుకుంటున్నానని అంటోంది రష్మిక.