Rashmika Mandanna Back Pain.. సినీ తారలు తమ సినిమాల ప్రమోషన్ల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. రష్మిక ఈ విషయంలో అందరికన్నా ముందుంటుందనడం సబబేమో.!
మరీ ముఖ్యంగా ‘పుష్ప ది రైజ్’ సినిమాలోని ‘సామీ..’ పాటతో రష్మిక మండన్న చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఎక్కడికి వెళ్ళినా ‘సామీ..’పాటకి డాన్స్ చేసేస్తుండేది.
రష్మిక ఉత్సాహం చూసి, బాలీవుడ్ నటుడు గోవిందానే ఆమెతో కలిసి ‘సామీ’ పాటకి డాన్స్ వేశాడు ఓ ఈవెంట్‌లో. దటీజ్ రష్మిక మండన్న.
Rashmika Mandanna Back Pain.. నడుం నొప్పి.. ఇకపై కష్టమే.!
‘సామీ..’ పాటకు స్టెప్పులు వేసీ.. వేసీ.. బోర్ కొట్టేసిందని అనడం కష్టమే కదా.! బాగోదు కూడా.! అందుకే, ‘ఆ పాటకు డాన్స్ ఎక్కువగా చేసేస్తుండడం వల్ల నడుం నొప్పి వస్తోంది’ అంటూ రష్మిక సెలవిచ్చింది.

ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు రష్మిక ఇచ్చిన ఈ సమాధానం వైరల్‌గా మారింది. ఏదో సరదాగా అలా అనేసిందిగానీ, ‘సామీ’ పాట ప్లే అయితే, రష్మిక డాన్స్ చేయకుండా వుండగలదా.? ఛాన్సే లేదు.
‘పుష్ప ది రైజ్’ తర్వాత ఎన్ని పాటలకు డాన్స్ చేసినాగానీ, ‘సామీ’ (Pushpa The Rise Saamy) పాట కిక్కు అయితే ఆమెకు మళ్లీ రాలేదు.
మొన్నటికి మొన్న ‘రంజితమే..’ అంటూ ‘వారసుడు’ సినిమాలో పాటకి దుమ్ము రేపినా.. ‘సామి సామి’ పాట ముందు బలాదూర్ అంతే.! ఆ సంగతి రష్మికకి కూడా బాగా తెలుసు.
పుష్ప ది రూల్ సంగతేంటో..
సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (Music Director Devi Sri Prasad) ఇంకోసారి, అంతకు మించి.. అనేలా ట్యూన్స్ ‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule) కోసం రెడీ చేస్తున్నాడు.
మరీ ముఖ్యంగా ‘సామీ’ పాటకు మించి.. కేవలం రష్మిక (Rashmika Mandanna) కోసమే ఓ పాటను ఈపాటికే డిజైన్ చేసేసి వుండాలి.
Also Read: Ritu Varma.. భామవే.. సత్యభామవే.!
సో, నడుం నొప్పి అంటే కుదరదు.. ఇంకో పాటకు నడుం గట్టిగా వంచాల్సిందే మరి.! రష్మికా.. (Rashmika Mandanna) రెడీనా.?