Table of Contents
Rashmika Mandanna Short Dress.. కొన్నాళ్ల కిత్రం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పొట్టి దుస్తులేసుకుంటే, అదో పెద్ద రచ్చయ్యింది. ఎవడో ఓ కొటె నెటిజన్ రకుల్ మీద జుగుప్సాకరమైన ‘సెషన్’ కామెంట్ చేశాడు. రకుల్ తగ్గలేదు. అంతకు మించిన డోస్‌తో సదరు నెటిజన్ తల్లి మీద ‘సెషన్’ కామెంట్ చేసింది.
ఏం ఖర్మ ఇది.! ఎక్కడున్నాం మనం.? మీడియా ‘భ్రష్టత్వం’ ఎంత దారుణంగా తయారైందో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం నుంచీ, పొట్టి దుస్తుల హంగామా వెండితెరపై కనిపిస్తూనే వుంది. ఎవరిష్టం వాళ్లది. డ్రస్సు సైజును బట్టి, మహిళల క్యారెక్టర్‌ని డిసైడ్ చేయడం దారుణం.
తప్పంతా చూసే కళ్ళదే.! చూపించేటోళ్ళది కాదా.?
ఆగండాగండి.. అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చేయొద్దు. బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డి ఈ మధ్యనే సోషల్ మీడియాలో ఓ ఫోటో పెట్టి.. ‘నా థైస్‌లో డాష్ అప్పీల్ లేదు.. చూసే మీ కళ్లలోనే వుంది..’ అని స్టేట్‌మెంట్ పాస్ చేసింది. ‘థైస్’ని తెలుగులో ప్రస్థావించాలంటే చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంది.
అసలు ఇదేం చర్చ.? అంటే, ఈ మధ్య మెయిన్ స్ర్టీమ్ మీడియాలో హీరోయిన్ల మీద వార్తలన్నీ దాదాపుగా ఇలాగే తగలడుతున్నాయ్ మరి. ఫలానా హీరోయిన్ ఒంపు సొంపులు, ఫలానా హీరోయిన్ ఎత్తు పల్లాలూ.. ఫలానా హీరోయిన్ పొట్టి దుస్తులు.. వీక్షకులు, పాఠకులు అవే కోరుకుంటున్నారా.?
Rashmika Mandanna Short Dress.. బట్టల భ్రష్టత్వం.. ఎవరిదీ పాపం.?
ఏమో కానీ, ఈ బట్టల భ్రష్టత్వం అయితే, మీడియాని బాగా కమ్మేసింది. ఈ మధ్యనే రష్మికా మండన్న మీద కూడా పొట్టి దుస్తుల పంచాయితీ రచ్చ రేపింది. మెయిన్ స్ర్టీమ్ మీడియా, వెబ్ మీడియా, సోషల్ మీడియా.. ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయ్. భ్రష్టుపట్టిపోవడంలో ఒకదాన్ని మించి, ఇంకోటి.

ఛీ.. ఛీ..! ఇవేం హెడ్డింగులు.? ఇవేం పదాలు.? ఇవేం రాతలు.? రాతకే రోత పుడుతోంది. అయినా ఇదేమన్నా ఇప్పుడు కొత్తగా మొదలయిన ‘బట్టల పంచాయితీనా.? కాదని ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. మళ్లీ మళ్లీ చెప్పుకుంటూనే వుంటాం కూడా.
పెన్ను పైత్యం.!
అలాగే, అందాల భామలు తగ్గేదే లే.! అంటూనే వుంటారు. నెటిజన్లు కూడా అంతే, తామూ తగ్గేదే లే.. అన్నట్లు ట్రోలింగ్స్ చేస్తూనే వుంటారు. ‘రాత’ పేరుతో ‘రోత’ కొనసాగుతూనే వుంటుంది. ఇదొక నెవ్వర్ ఎండింగ్ ప్రసహనం.
Also Read: చిక్కు ప్రశ్న: అనసూయ భరద్వాజ్‌ని ఏమని పిలవాలి.?
అన్నట్లు, ట్రోలింగ్ కూడా సో కాల్డ్ సెలబ్రిటీలకి పబ్లిసిటీ పరంగా మేలు చేసే అంశమే అనుకోండి. అందుకే పైకి కస్సుబుస్సులాడుతున్నా, లోపల మాత్రం ట్రోలింగ్‌కి అవసరమైనంత స్టఫ్, సాథ్యమైనంత కురచ దుస్తుల ద్వారా అందించాలనే అనుకుంటారు. అందిస్తూనే వుంటారు.
రాసుకున్నోడికి రాసుకున్నంత. చూసుకున్నోడికి చూసుకున్నంత.. ‘రోత’.!