Rashmika Mandanna Wedding Plans.. కాదంటే ఔననిలే.! ఔనంటే కాదనిలే.! అంటాడో కవి.! ఆడవారి మాటలకు అర్థాలు వేరులే.. అంటాడు ఇంకో కవి.!
ఇంతకీ, రష్మిక మాటల్లోని అంతరార్థమేంటి.? ప్చ్.. అదే, అర్థమవ్వట్లేదెవరికీ.! విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న.. ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ చేసుకున్నారన్న ప్రచారం జరిగింది.
ఈ విషయమై ఇప్పటిదాకా ఇటు విజయ్ దేవరకొండ కావొచ్చు, అటు రష్మిక మండన్న కావొచ్చు.. అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.!
ఇంతలోనే, రష్మిక – విజయ్.. త్వరలోనే పెళ్ళి పీటలెక్కబోతున్నారనీ, మార్చిలో ముహూర్తం కూడా ఖరారైపోయిందనీ.. గుసగుసలు వినిపిస్తున్నాయి.
Rashmika Mandanna Wedding Plans.. ధృవీకరించలేక.. ఖండించలేక..
‘నా పెళ్ళి గురించి వస్తున్న వార్తల్ని ఖండించలేను, అలాగని ధృవీకరించలేను..’ అంటూ రష్మిక మండన్న తాజాగా సెలవిచ్చింది.!
అదేంటీ, అంత కష్టపడాల్సిన అవసరమేముంది.? నిజమైతే ధృవీకరించొచ్చు.. కాకపోతే, ఖండించొచ్చు. ఖండించలేనంత ఇబ్బంది ఎందుకు.? ధృవీకరించడానికి మొహమాటమెందుకు.?

ఇదే విషయాన్ని రష్మిక వద్ద ప్రస్తావిస్తే, ‘ఏ వేదికపై ఏం మాట్లాడాలో అదే మాట్లాడతాను..’ అని చెప్పింది. దటీజ్ రష్మిక మండన్న.! ఏదీ స్ట్రెయిట్‌గా చెప్పదామె.
సరైన వేదిక.. ఎక్కడ.? ఎప్పుడు.?
సరైన వేదికపై, సరైన సందర్భంలో.. ఆయా అంశాలపై స్పందిస్తానంటూ రష్మిక చెప్పిన మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.
Also Read: ప్రేమించే పెళ్ళాడతానన్న భాగ్యశ్రీ.! ఆ ప్రేమికుడెవరో.?
సరే, సమయమొచ్చినప్పుడు రష్మిక చెబుతుందిలే.. ఎంగేజ్మెంట్ వార్తలెలానో, పెళ్ళి వార్తలూ అలానే.. అని కొందరు లైట్ తీసుకుంటున్నారు.!
రష్మిక ఇటీవల ‘ది గర్ల్ ప్రెండ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, ప్రస్తుతం తన తదుపరి సినిమాల్లో బిజీగా వున్నాడు.
