Rathika Rose BB7 Telugu.. రతిక రోజ్.! ఆమె ఎవరు.? ఏమో, పెద్దగా ఎవరికీ తెలియదు.! ‘పటాస్’ కామెడీ షోలో కనిపించిందట.!
అంతే, అంతకు మించి పెద్దగా ఆమె గురించి ఇంట్రడక్షన్ కూడా లేదు.! కానీ, బిగ్ బాస్ రియాల్టీ ఏడో సీజన్, ప్రారంభమవుతూనే లాంఛింగ్ ఈవెంట్‌తో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అనిపించుకుంది.
హౌస్‌లోకి అడుగు పెట్టాక కథ వేరేలా వుంటుంది కదా.! వేరేగా ఏం లేదు.! రతిక రోజ్ (Rathika Rose) రేంజ్ పెరుగుతూనే వుంది. ఆమె అలా పెంచుకుంటూ పోతోంది.
Rathika Rose BB7 Telugu కెమెరాని బాగా ఫేవర్ చేస్తోంది..
కెమెరాని ఆమె ఫేవర్ చేస్తోందా.? ఆమెకే కెమెరా ఫేవర్ చేస్తోందా.? కారణం ఏదైతేనేం, రతికకి స్క్రీన్ స్పేస్ బాగా దక్కుతోంది.
పల్లవి ప్రశాంత్ కలుపుతున్న పులిహోర సహా, చాలా వ్యవహారాలు రతిక రోజ్‌ని వేరే లెవల్‌లో నిలబెడుతున్నాయి ప్రతి రోజూ.!
మల్టీ టాలెంటెడ్ అన్నట్లుంది రతిక రోజ్ (Rathika Rose). మాటలు చక్కగా మాట్లాడుతోంది. డాన్సులూ బాగా చేస్తోంది. పాటలు కూడా పాడుతోంది. అందర్నీ ఇమిటేట్ కూడా చేస్తోంది.
మోత మోగుతోందంతే..
బిగ్ బాస్ (Bigg Boss Telugu Reality Show) రియాల్టీ షోలో, ‘తగినంత ఫుటేజ్’ ఇవ్వగలగడమే పెద్ద టాస్క్. ఆ ఫుటేజ్ ఇవ్వడానికి ఆమె దగ్గర చాలా కంటెంట్ వున్నట్టుంది.
అందుకే, మంచి స్క్రీన్ స్పేస్ లభిస్తోంది రతికకి.! బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు వెర్షన్ ఏడో సీజన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా రతిక (Rathika Rose) ఇప్పటికే పేరు తెచ్చేసుకుంది.
Also Read: ఎలుకాయ నమః బతికేద్దాం ఇంకొన్నేళ్ళు నిస్సిగ్గుగా.!
సోషల్ మీడియాలో అయితే, రతిక రోజ్ నిత్యం ట్రెండింగ్‌లోనే వుంటోంది. ఈ సీజన్‌కి సంబంధించినంతవరకు ఇప్పటిదాకా చూసుకుంటే.. రతిక రోజ్ పేరు మీదనే ఎక్కువ ట్వీట్లు పడుతున్నాయ్.!
కానీ, రతిక ఇదే రేంజ్‌ని కొనసాగిస్తుందా.? ఏమో, ముందు ముందు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే, టాప్ ఫైవ్‌లో రతిక ఖచ్చితంగా వుంటుందన్న అభిప్రాయం బిగ్ బాస్ వ్యూయర్స్‌లో వ్యక్తమవుతోంది.