Raviteja EAGLE Teaser.. మాస్ మహరాజ్ అయినంతమాత్రాన.. ఇలా లుంగీలో నిల్చోబెట్టాలా.? కానీ, అందులో తప్పేముంది.? తప్పేమీ లేదు.!
రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఈగల్’ సినిమా నుంచి టీజర్ బయటకు వచ్చింది. టీజర్ నిండా హీరోయిజం ఎలివేట్ అయ్యే డైలాగులే.
దాదాపుగా ప్రధాన పాత్రధారులందరిచేతా, హీరోయిజం ఎలివేట్ అయ్యేలా డైలాగులు చెప్పించేశారు.. టీజర్ కోసమే అన్నట్టు.!
ఇంతకీ, ‘ఈగల్’ సంగతేంటి.? ఈ సినిమాలో రవితేజ పాత్ర ఏంటి.? అడవిలో వుంటాడట.! లుంగీలో కనిపిస్తున్నాడు రవితేజ, చేతిలోనేమో పవర్‌ఫుల్ వెపన్.!
హెలికాప్టర్‌ని చూస్తున్నాం.. బ్లాస్టింగ్స్ కనిపిస్తున్నాయ్.! రివెంజ్ డ్రామా అనే విషయం అర్థమవుతోంది.!
ప్రకృతిని విధ్వంసం చేసే విచ్ఛిన్నకర శక్తులకీ, ఓ వ్యక్తికీ మధ్య జరిగే పోరాటం అనుకోవచ్చా.? అంతేనేమో.!
రవితేజ, ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నానని అనుకుంటున్నాడుగానీ.. అందులోనూ ‘పరమ బోరింగ్’ వ్యవహారాలే కనిపిస్తున్నాయ్.
‘రావణాసుర’ ఫెయిల్ అయినా, ‘టైగర్ నాగేశ్వరరావు’ అడ్రస్ గల్లంతయినా.. మూస మాస్ వల్లనే అన్న చర్చ అంతటా జరుగుతోంది.
మరి, ‘ఈగల్’ సంగతి ఏమవుతుందో.! అది తెలియాలంటే సినిమా విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ ఈ సినిమాలో హీరోయిన్లు. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు.