రేవంత్ రెడ్డి అనగానే ముందుగా ‘ఓటుకి నోటు’ కేసు గుర్తుకు రావడం సహజం. అయితే, రాజకీయాల్లో ఎన్నో ఎత్తు పల్లాల్ని చవిచూసిన రేవంత్ రెడ్డి, కింది స్థాయి నుంచి రాజకీయంగా ఎదిగి, ఉన్నత స్థానానికి చేరుకున్న వ్యక్తి. ఆయన్ని ఓ పోరాట యోధుడిగా చాలామంది చూస్తారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy New Political Power Center In Telangana) కోసమంటూ ఓ రాజకీయ ‘సైన్యం’ వుందంటే ఆషామాషీ వ్యవహారం కాదు.
రవ్వంత లేని రేవంత్ రెడ్డీ.. అంటూ చాన్నాళ్ళ క్రితం మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సరదాగా వ్యాఖ్యానించిన విషయం అందరికీ గుర్తుండే వుంటుంది. కానీ, ఆ రేవంత్ రెడ్డి ఇప్పుడు.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడయ్యాడు.
Also Read: బురదలో కూరుకుపోయిన జర్నలిజం.. సమాజానికి హానికరం.!
ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో, తెలంగాణ టీడీపీలో (Telangana TDP) కీలక నాయకుడిగా ఎదిగిన రేవంత్ రెడ్డి, టీడీపీలో కొనసాగలేక, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన విషయం విదితమే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా, లోక్ సభ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటిన రేవంత్ రెడ్డి (Revanth Reddy), ప్రస్తుతం తెలంగాణ పీసీసీ చీఫ్ అధ్యక్షుడిగా అవకాశం దక్కించుకున్నారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్ష పీఠమంటే కత్తి మీద సాము లాంటిదే. తెలంగాణలో ‘ఇంటి పార్టీ’ అనే గుర్తింపు వున్న తెలంగాణ రాష్ట్ర సమితిని (Telangana Rashtra Samithi) కాంగ్రెస్ పార్టీ ఢీకొనడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకే, కలిసొచ్చే అన్ని రాజకీయ శక్తుల్నీ కలుపుకుపోయేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. పార్టీలో వ్యతిరేక వర్గాన్ని సైతం తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు రేవంత్ రెడ్డి.
Also Read: విద్యావ్యవస్థకి డబ్బు జబ్బు.. నేరమెవరిది.? శిక్ష ఎవరికి.?
వాస్తవానికి, 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Elections) జరగాల్సి వుంది. కానీ, తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. 2022లోనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎన్నికలకు వెళతారన్నది రేవంత్ రెడ్డి జోస్యం. అందుకేనేమో, రేవంత్ అత్యంత వేగంగా పావులు కదుపుతున్నారు.
రేవంత్ రెడ్డికి దూకుడెక్కువ.. ఆ దూకుడు కారణంగానే ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయారు. కానీ, అదే దూకుడు ఆయన్ని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడ్ని చేసింది. సో, రేవంత్ రెడ్డి.. (Revanth Reddy New Political Power Center In Telangana) భవిష్యత్ రాజకీయాల్లో ఎలా వుండబోతున్నారు.? ఏ స్థాయికి ఎదగనున్నారు.? ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది.