Revanth Reddy Pragathi Bhavan.. విమర్శ ఎప్పుడూ సద్విమర్శగానే వుండాలనేది ప్రముఖులు చెప్పేమాట.! అత్యంత బాధ్యతాయుతమైన వ్యక్తులు మాత్రమే సద్విమర్శ చేస్తుంటారు.
రాజకీయాలంటే బాధ్యతగా వుండాలి. అసలు రాజకీయమంటేనే సేవ.! అలాంటప్పుడు, బాధ్యత లేకపోతే ఎలా.? సద్విమర్శలకు కాలం చెల్లింది. కేవలం కువిమర్శలకే మీడియా సైతం ప్రాధాన్యతనిస్తోంది.
సద్విమర్శ.. స్థాయిని పెంచుతుంది.!
Mudra369
కువిమర్శ.. స్థాయిని తగ్గిస్తుంది.!
విపరీత వ్యాఖ్యలు.. సమాజానికి చేటు చేస్తాయ్.!
అసలు విషయంలోకి వస్తే, విమర్శలు చేసే క్రమంలో మాట మీద అదుపు కోల్పోతున్నారు రాజకీయ నాయకులు. ఆ లిస్టులో రేవంత్ రెడ్డి పేరు ఖచ్చితంగా ముందు వరుసలోనే వుంటుంది.
Revanth Reddy Pragathi Bhavan.. పేల్చేసేదాకా వెళ్ళింది..
ప్రగతి భవన్‌ని పేల్చేయడమేంటి.? నక్సలైట్లు పేల్చేయాలని పిలుపునివ్వడమేంటి.? ప్రగతి భవన్ విషయంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి అభ్యంతరాలుండొచ్చుగాక.!
నిజానికి, ప్రగతి భవన్ అనేది క్యాంప్ కార్యాలయం.. దానికి ప్రజాధనాన్ని వెచ్చించారు. అలాంటప్పుడు, దాన్నెలా పేల్చేస్తారు.?
రేవంత్ రెడ్డి.. లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు..
Mudra369
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన తెలంగాణ అనే రాష్ట్రంలో రధ సారధి..
రాజకీయమంటే బాధ్యత.! ఇది ఏ రాజకీయ నాయకుడికైనా వర్తిస్తుంది..
రేప్పొద్దున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే, ఆ క్యాంపు కార్యాలయాన్ని ఎందుకు వినియోగించుకోకూడదు.? కాస్త సోయ ప్రదర్శిస్తే.. ఇలాంటి ‘విపరీత’ వ్యాఖ్యలు నోటివెంట రావు.
స్టాప్ లుక్ అండ్ ప్రొసీడ్..
పీసీసీ అధ్యక్షుడైతే అయ్యారుగానీ, కాంగ్రెస్ పార్టీలోనే చాలామంది రేవంత్ రెడ్డిని గౌరవించడంలేదు. బహుశా ఆ అసహనంలోంచే ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయేమో.
Also Read: Jr NTR.. తప్పెవరిది.? ఆ అభిమానులదా.? ఈ హీరోలదా.?
బాధ్యతగల ఎంపీగా అయినా, రేవంత్ రెడ్డి తన మీద అదుపు ప్రదర్శించడం చాలా చాలా అవసరం. రాజకీయ విమర్శలంటారా.? వాటిని తప్పు పట్టలేం.
ఇప్పుడున్న రాజకీయమే వేరు. రాజకీయ నాయకులు తిట్టాలా.. న్యూస్ ఛానళ్ళు పండగ చేసుకోవాలా.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసెయ్యాలా.!