RIP Ram Gopal Varma.. ఏమైంది రామ్ గోపాల్ వర్మకి.? ‘RIP Janasena’ అని ట్వీటేశాడేంటీ.? పవన్ కళ్యాణ్ మీద అభిమానమంటాడు.. ఆ పవన్ కళ్యాణ్ అంటే అస్సలు గిట్టనితనం ప్రదర్శిస్తాడు.!
వ్యక్తుల మీద సినిమాలు తీసి, పైశాచిక ఆనందం పొందడంలో రామ్ గోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా. పోనీ, ఆ సినిమాలేమన్నా ఆడతాయా.? అంటే అదీ లేదు.
తనలో పైత్యం వుంది.. దానికి రేటు కట్టేటోళ్ళు చాలామంది వున్నారు. అమ్మేసుకుంటాడంతే.! అంతకు మించి, రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుకోడానికేముంది.?
RIP Ram Gopal Varma.. జనసేన మీద ఆర్జీవీ ‘అతి’.!
ఓ పార్టీ గురించి ప్రస్తావిస్తూ, ‘RIP’ అనడమంటే, దాన్ని అస్సలు సమర్థించలేం. అలా అనాలంటే, ఆయన ఆ పార్టీకి రాజకీయ ప్రత్యర్థి అయి వుండాలి.

‘నేను కామన్ మేన్.. నా ఇష్టం వచ్చినట్లు నేను మాట్లాడతా..’ అంటే, పిచ్చోడనే భావించాల్సి వస్తుందేమో ఎవర్నైనా.!
గత కొద్ది రోజులుగా జనసేన పార్టీ (Jana Sena Party) మీదా, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) మీదా సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేస్తున్నాడు ఆర్జీవీ (Ram Gopal Varma).
వోడ్కా డబ్బుల కోసమేమో.!
ఆర్జీవీ (RGV) పడుతున్న పాట్లు చూసి, వర్మకి వోడ్కా కొనుక్కోడానికీ డబ్బుల్లేవేమో.. అందుకే ఇంతలా దిగజారిపోయాడన్నది వర్మ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లోనే కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
Also Read: Swetha Naagu.. అత్యంత విషపూరితమా.! అసలుందా.?
ఎవరిష్టం వారిది.! ‘RIP Janasena’ అని రామ్ గోపాల్ వర్మ అంటోంటే, ‘RIP RGV’ అని, ఆయన్ని అనుకుండా వుంటారా.? అంతేనా, ఈ రిప్పు గోలేంట్రా వోడ్కా ఎర్రి పప్పూ.. అంటూ వేరే లెవల్ ట్రోలింగ్ ఆర్జీవీ మీద జరుగుతోంది.
మొన్నీమధ్యనే ఓ పెద్దాయన ఎర్రి పప్పకి కొత్త అర్థం చెప్పాడు. ఎర్రి పప్ప అంటే, బుజ్జి నాన్నా అని అర్థమట.!
ఆర్జీవీ (RGV) ఒక మాట అంటే, కొన్ని లక్షలు.. కోట్ల మంది.. అంతకంటే ఎక్కువ మాటలు అనగలరు. అది ఆర్జీవీ తెలుసుకోవాల్సి వుంది.