బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ది (Rishi Sunak Caste) ఏ కులం.? ఇప్పుడీ విషయమై అంతర్జాతంలో వెతుకులాడేస్తున్నారట కుల జాడ్యంతో రగిలిపోతున్నవాళ్ళంతా.
రిషి సునాక్ తల్లిదండ్రులు విదేశాల్లో జన్మించారు. పంజాబ్ నుంచి తూర్పు ఆఫ్రికాకి తరలి వెళ్ళింది ఆయన తాతగారి కుటుంబం. రిషి సునాక్ తండ్రి కూడా విదేశాల్లోనే జన్మించారు.
భారతీయ మూలాలున్నాయ్ ఆయనకి. అంతే తప్ప, ఆయన భారతదేశంలో పుట్టలేదు, భారతదేశంలో చదవలేదు. కానీ, భారతదేశానికి చెందిన అమ్మాయినే పెళ్ళాడాడు.

ఔను, రిషి సునాక్.. మన ఇప్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు. సో, రిషి సనాక్ మనోడేనన్నమాట.! ఇలా ఆనంద పడితే, దాన్ని తప్పు పట్టాల్సిన పనిలేదు.
Rishi Sunak Caste.. రిషి సునాక్ది ఏ కులం.?
ఇంతకీ, రిషి సునాక్ ఏ కులంలో పుట్టాడబ్బా.? సమాధానం దొరికిందా.? లేదా.? ఏంటో, ఈ కుల పైత్యం మన భారతీయులకే ఎక్కువ. అందునా, తెలుగునాట ఈ పైత్యం మరీ ఎక్కువ.
Also Read: Virat Kohli, The Run Machine: గెలిచాడు.. గెలిపించాడు.!
తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వున్నంత కుల జాడ్యం ప్రపంచంలో ఇంకెక్కడా వుండదు.! అందుకే, మన తెలుగు మీడియా కూడా రిషి సునాక్ ఏ కులంలో పుట్టాడన్న విషయమై ‘ఆరాలు తీయడం మొదలు పెట్టింది.
కుల జాడ్యం విదేశాల్లో వుండదు కాబట్టి, రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అవగలిగాడుగానీ.. లేదంటేనా.? ఆయన అక్కడిదాకా వెళ్ళే పరిస్థితి వుండేది కాదు.
