Ritu Varma ‘బాద్షా’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ తదితర సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన ముద్దుగుమ్మ రీతూ వర్మ. ఆ తర్వాతి కాలంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.
విజయ్ దేవరకొండతో ‘పెళ్లి చూపులు’ సినిమా కోసం రీతూ వర్మ హీరోయిన్గా ప్రమోట్ అయ్యింది. ఈ సినిమా రీతూ వర్మకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
ఇక్కడా అక్కడా నేనే అంటోన్న తెలుగమ్మాయ్.!
ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకొచ్చింది. ‘కేశవ’ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది రీతూ వర్మ. అలాగే, ‘వరుడు కావలెను’ అంటూ నాగ శౌర్యతో జత కట్టింది.
కాజల్ చెల్లివా.? అంటే, కాజల్‌కి చెల్లెలు కాకపోయినా.. ఔను.. జూనియర్ కాజల్ అని ఆమెను అప్పట్లో అంతా పిలిచేవారు.! కానీ, ఇప్పుడు రీతూ వర్మ.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది.
Mudra369
ఓ వైపు తెలుగు సినిమాలు చేస్తూనే, మరోవైపు తమిళనాట కూడా దూకుడు ప్రదర్శించింది రీతూ వర్మ. చివరిగా తెలుగులో ‘ఒకే ఒక జీవితం’ సినిమాలో నటించింది రీతూవర్మ.

శర్వానంద్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఓ మోస్తరు టాక్‌తో రన్ అయ్యింది. ప్రస్తుతం పలు తమిళ సినిమాలతో బిజీగా వుందీ పదహారణాల తెలుగమ్మాయ్ రీతూ వర్మ.
బ్యూటీ ఆఫ్ ఇంటెలిజెన్స్.!
తమిళ స్టార్ హీరో విక్రమ్ సరసన ‘ధృవ నక్షత్రం’ సినిమాలో నటిస్తోంది రీతూ వర్మ. స్పై థ్రిల్లర్ కాన్సెప్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకి గౌతమ్ మీనన్ దర్శకుడు.

ఈ సినిమాలో రీతూ వర్మ పాత్ర చాలా కొత్తగా ప్రాధాన్యత కలిగి వుంటుందని తెలుస్తోంది. అలాగే, తెలుగులోనూ కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో వున్నాయ్.
Also Read: వరుణ్ తేజ్ పెళ్ళి బాజా.! లావణ్య త్రిపాఠితోనేనా.?
సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ, కెరీర్‌ని ఇంటెలిజెంట్‌గా బిల్డప్ చేసుకుంటున్న రీతూ వర్మ పుట్టినరోజు ఈ రోజు (మార్చి 10). ఈ అందాల భామ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిద్దాం. హ్యాపీ బర్త్‌డే టూ యూ రీతూవర్మ.!