Roja Selvamani About Elections.. మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్కే రోజా అలియాస్ రోజా సెల్వమణి ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ ‘ఓటమి’కి కొత్త నిర్వచనం చెప్పారు.
‘ప్రజలు ఓడిస్తే వచ్చిన ఓటమి కాదు..’ అంటూ రోజా సెలవిచ్చారు. నిజానిజాలు నిదానంగా అయినా బయటకు వస్తాయని అంటున్నారామె.
ఘోరంగా ఓడిపోయేంత తప్పులు తామేమీ చేయలేదని మాజీ మంత్రి రోజా చెబుతుండడం గమనార్హం.
Roja Selvamani About Elections.. గెలుపోటములు సహజం..
రాజకీయాలన్నాక గెలుపోటములు సహజం. ఓటమిని హుందాగా స్వీకరించాలి. గెలుపు వచ్చినప్పుడు, బాధ్యతగా నడచుకోవాలి.
కానీ, గెలిచిన తర్వాత.. రాజకీయమంటే బూతులే.. అన్నట్లు విర్రవీగారు రోజా సహా వైసీపీలో చాలామంది నాయకులు.
వైసీపీ హయాంలో ఏ మంత్రి మీడియా ముందుకొచ్చినా, బూతులు తప్ప తమ తమ శాఖల గురించి మాట్లాడిన సందర్భాల్లేవనడం అతిశయోక్తి కాదు.

పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ ప్రస్తావన, నారా లోకేష్ ‘డిక్కీ’ తప్ప, తన శాఖ వ్యవహారాల గురించి రోజా ఏనాడైనా మీడియా ముందు మాట్లాడారా.?
మంత్రులుగా పనిచేసినవాళ్ళే కాదు, ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ కూడా, అధికారిక బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించే మాట్లాడేవారు.
ఏలియన్స్ కాదు కదా ఓడించింది.?
ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. నాయకులంటే, సేవకులు మాత్రమే.! ఏ నాయకుల్ని గెలిపించాలి.? ఏ పార్టీకి అధికారమివ్వాలి.? అన్నది ప్రజలే నిర్ణయించుకుంటారు.
తమ ఓటమికి ప్రజలు కారణం కాదని రోజా అనొచ్చుగాక. కానీ, రోజా సహా వైసీపీని ఓడించింది ప్రజలే.! అంతే తప్ప, గ్రహాంతరవాసులు కాదు వైసీపీని ఓడించింది.
Also Read: రవితేజ ‘తప్పు’టడుగులు.! ఆత్మవిమర్శ ఇంకెప్పుడు.?
2014, 2019 ఎన్నికల్లో నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచారంటే, ఆమెను గెలిపించింది ప్రజలే. అంతకు ముందు ఆమెని ఓడించింది ప్రజలే.
ఇప్పుడు.. అంటే, 2024 ఎన్నికల్లో కూడా రోజాని ఓడించింది ఆ ప్రజలే.. ఏలియన్స్ ఏమాత్రం కాదు. ఏలియన్స్కి వైసీపీ ఓటమితో సంబంధం లేదని వైసీపీ నేతలు ఎప్పుడు గుర్తిస్తారో ఏమో.!