Roja Selvamani Dress Controversy.. ఒకప్పటి సినీ నటి, ఒకప్పటి మంత్రి, ఒకప్పటి ఎమ్మెల్యే రోజా వస్త్రధారణ విషయమై పెద్ద రచ్చే జరుగుతోంది.!
రోజా అంటే, సినీ నటి.! సో, ఆమె వస్త్రధారణపై వివాదాలు అనవసరం. కానీ, ఆమె ఓ రాజకీయ నాయకురాలు.! అయితే మాత్రం, ఆమె వస్త్రధారణ.. ఆమె ఇష్టం.!
ప్చ్.. అలా అంటే ఎలా కుదురుతుంది.? ఇతరుల వస్త్రధారణ మీద నానా రకాల విమర్శలూ, అత్యంత అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలూ రోజా గతంలో చేసెయ్యలేదా.?
Roja Selvamani Dress Controversy.. తప్పదు.. మాట పడాల్సిందే.!
బాధ్యతగల రాజకీయ నాయకురాలి వస్త్రధారణ ఎలా వుండాలో గతంలో రోజా (Roja Selvamani), మీడియాకెక్కి చేసిన ‘సూచనలు’, విసిరిన విమర్శనాస్త్రాలు అన్నీ ఇన్నీ కావు.
నోరుంది కదా.. అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడేయడం.. రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. కానీ, ఆ మాటలు తమ రాజకీయ జీవితానికి సమాధి కడతాయని తెలుసుకోవాలి.!
పద్ధతిగా చీర కట్టుకోవాలి.. అంతేగానీ, చుడీదార్లు వేయడమేంటి.? అని రోజానే, గతంలో ఓ మహిళా రాజకీయ నాయకురాలిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సో, ‘వస్త్రధారణ’ విషయమై రోజా కూడా జాగ్రత్తగా వుండి తీరాలి. కానీ, విదేశీ పర్యటనలో భాగంగా, రోజా ఓ పొట్టి గౌను వేసుకుని కనిపించడమేంటి.? అన్నది రాజకీయ ప్రత్యర్థుల ప్రశ్న.
డిక్కీ బలసిన కోడి.. అనొచ్చా.? తప్పు కదా.!
అందుకే, విమర్శలు చేసేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. ‘డిక్కీ బలిసిన కోడి’, ‘ఇత్తడైపోద్ది..’ లాంటి మాటల్ని రోజా, మంత్రి హోదాలో వున్నప్పుడే చేశారాయె.! ఇప్పుడు అనుభవించాల్సిందే మరి.!
Also Read: వైకల్యానికి కోటా ఎందుకని ప్రశ్నించినందుకే ఆమెని రక్కేస్తారా?
అన్నట్టు, రోజా (RK Roja) గతంలో రెండు సార్లు నగిరి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ ముందర బోల్తాపడ్డారామె.
మంత్రి హోదాలో ఎన్నికల్ని ఫేస్ చేసిన రోజా, ఇటీవలి ఎన్నికల్లో నగిరి (Nagiri Andhra Pradesh) నియోజకవర్గం నుంచే పరాజయాన్ని మూటగట్టుకున్నారు.