Rowdy Boys Telugu Review: ఆశిష్ రెడ్డి (Ashish Reddy) కొత్త హీరో, పైగా ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ వుందాయె.! దాంతో, సినిమా కోసం భారీగానే ఖర్చు చేసేశారు.
కుర్రాడు డాన్సులు నేర్చుకున్నాడేమో.. బాగానే చేశాడు. ఆ విషయం ప్రోమోలతోనే అర్థమయిపోయింది. యాక్టింగ్ స్కిల్స్ విషయానికొస్తే, ఫర్వాలేదనాలా.? బాగాలేదనాలా.?
హీరోయిన్ విషయానికొస్తే, మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఇప్పటికే సుపరిచితురాలు. ఆమె మంచి నటి. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవ్.
స్టార్ హీరోయిన్ అయ్యేందుకు అవసరమైన క్వాలిటీస్ అనుపమ పరమేశ్వరన్‌కి బాగానే వున్నాయ్. కానీ, లక్కు కలిసి రావడంలేదంతే.
Rowdy Boys Telugu Review: వెరైటీ కాదిది, పాచిపోయిన వంటకమే.!
హీరో కంటే హీరోయిన్ వయసులో కాస్త పెద్దది. కానీ, హీరోతో ఏకంగా ‘లివ్ ఇన్ రిలేషన్‌షిప్’ షురూ చేస్తుంది. ఇదేం కాన్సెప్ట్ మహాప్రభో.! అంటే, అదంతే. యూత్‌పుల్ సబ్జెక్ట్ మరి. ఆ మాత్రం వుండాలి కదా.? మూతి ముద్దుల్లేకపోతే ఈ రోజుల్లో సినిమాలు కష్టం.
అగ్ర హీరోలైనా, కొత్త హీరోలైనాసరే.. సినిమాకి అవసరం వున్నా, లేకున్నాసరే. మూతి ముద్దులు తప్పవ్.! అసలు అవెందుకు.? అంటే, సోకాల్డ్ సినీ జనాలకు కోపమొచ్చేస్తుంది. ఛీ.. ఛీ.. చిన్న పిల్లలతో కలిసి సినిమాలు చూడలేకపోతున్నాం.. అన్నగానీ, ‘తగ్గేదే లే’ అంటున్నారు.!
మెడికల్ కాలేజీ విద్యార్థులు వర్సెస్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు. ఇదీ ఈ సినిమా గొడవ. చాన్నాళ్ళ క్రితం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘సై’ సినిమా గుర్తుంది కదా.? అందులో ఆర్ట్స్ వర్సెస్ సైన్స్. ఈ ‘రౌడీ బాయ్స్’లో ఇంజనీరింగ్, మెడిసిన్ మధ్య రగడ. అంతే తేడా.
ఏమిటో.! ఏమిటేమిటో.!
‘రౌడీబాయ్స’ (Rowdy Boys) సినిమాలో అసలు భావోద్వేగాలే పండలేదు. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేశారంతా. ఇదెక్కడి పంచాయితీ మహాప్రభో.. అనిపిస్తుంది సినిమాలోని గ్రూపుల మధ్య తగాదాలు చూస్తే. చివరికి కథ సుఖాంతమవ్వాలి కాబట్టి, అయిపోయిందంతే.
అలా ఎలా.? అని ఏ సందర్భంలోనూ ప్రేక్షకుడు తనను తాను ప్రశ్నించుకోకూడదంతే. యూత్ ఆడియన్స్ ఈ సినిమాని కాలేజీ గొడవల గురించో, కాలేజీ ఆప్యాయతల గురించో చూసేందుకు ఆస్కారం లేదు. హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా ఏంటో, అదేంటో అనిపిస్తుందంతే.!
ఓటీటీలో కనిపిస్తున్నాగానీ, ఖాళీ సమయం దొరికినాగానీ.. సినిమాని పూర్తిగా చూడాలంటే మాత్రం కాస్తంత కష్టమైన వ్యవహారమే. ఇక, థియేటర్లకు వెళ్ళి సినిమా చూసినవాళ్ళ పరిస్థితేంటో.!
Also Read: ఏ‘కాంత’ సేవకు పిలిచిన ఆ హీరో ఎవరబ్బా.?
దర్శకుడు ఏం చేశాడు.? మాటల రచయిత పనితనమేంటి.? పాటల సంగతేంటి.? వీటి గురించి పెద్దగా మాట్లాడుకోవడానికేమీ లేదు.
సినిమాని రిచ్‌గా చూపించేందుకు బాగానే కష్టపడ్డారు. అంతలా ఖర్చు చేశారు మరి. జనాన్ని పోగేసేసి, హంగామా చేసేశారు తప్ప.. సినిమాలో కంటెంట్ దాదాపు శూన్యం.!