RRR Movie JrNTR Olivia Morris: అదేంటీ ఎన్టీవోడికే డౌటొచ్చింది. ప్రమోషన్ కోసం సరదా ఇంటర్వ్యూ ఇచ్చి దాంట్లో సరదాగా సెటైరేసుకున్నాడా.? వున్నమాటే చెప్పాడా.?
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలివియా మోరిస్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.
అయితే, సినిమా ప్రమోషన్స్‌లో ఒలివియా ఇప్పటిదాకా ఎక్కడా కనిపించలేదు. కానీ, చరణ్‌కి జతగా నటించిన అలియా భట్ మాత్రం బాగానే కనిపిస్తోంది. ఎందుకని ఒలివియా జాడ లేకుండా పోయింది.? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.
RRR Movie JrNTR Olivia Morris.. ఒలీవియా మోరిస్ ఎక్కడ.? ఇరకాటంలో ఎన్టీయార్!
ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ‘ఆర్ఆర్ఆర్’ (RRR) టీమ్‌ని ఇంటర్వ్యూ చేశాడు. అందులో ఎన్టీయార్‌ని ఇరకాటంలో పెట్టిన ప్రశ్న ఒలివియా గురించే. ఎన్టీయార్ చాలా తెలివిగా చాలా సరదాగా సమాధానమిచ్చేశాడు.
సినిమాలో తనకు హీరోయిన్ వుందో.. లేదో.. అర్ధం కావడం లేదంటూ సరదాగా చిన్నపాటి అసహనం వ్యక్తం చేశాడు.
పక్కనే వున్న రాజమౌళి కిమ్మనలేదు. చరణ్ (Ramcharan) కూడా స్పందించలేదు. ఎందుకని.? ఏమో సినిమా చూస్తే ఆ సస్పెన్స్ ఏంటో అర్ధమవ్వచ్చు.
కానీ, ఈ లోగా తారక్ (Jr NTR) అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. బాధపడరా మరి.! తారక్ అంటే హై ఓల్టేజ్ ఎనర్జీ. తారక్ పక్కన గ్లామర్ వుండాలి కదా.!
ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలంటే, అటు చరణ్ (Mega Power Star Ram Charan), ఇటు ఎన్టీయార్ మధ్యలో అలియా (Alia Bhatt).. స్క్రీన్ అందంగా కనిపించడానికి ఇంతకన్నా ఇంకేం కావాలి.? ఈ ముగ్గురితోనే నిండుతనం వచ్చేసింది.
జక్కన్న ఎందుకు దాచినట్టు.?
ఇలా.. సరిపెట్టుకోవల్సిందే. తప్పదు మరి. జక్కన్న ఏం చేసినా దానికో అర్ధముంటుంది. ఒలివియాని చూపించాలనుకుంటే, ప్రమోషన్స్ కోసం ఆమెని ఎలాగైనా రప్పించేవాడే. రప్పించలేదంటే, సమ్‌థింగ్ ఏదో దాచిపెట్టాడనే అర్ధం.
Also Read: చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప.. ఈ భ్రష్టత్వం ఎవరిదప్పా.!
ఎన్టీయార్ (Young Tiger NTR) చిరు కోపంలో కూడా రాజమౌళి (SS Rajamouli) మీద నమ్మకమే కనిపించింది. రాజమౌళి ఎందుకు దాచాడో.. ఎన్టీయార్‌కే తెలుసు. చరణ్‌కీ తెలియకుండా వుంటుందా.? తెలియకుండా వుండదు.
ఇంతకీ మెరుపుతీగా.. అదేనండీ ఒలివియా మోరిస్ (Olivia Morris) సంగతేంటీ.?