రాజమౌళి, రామ్ చరణ్, రామారావు (ఎన్టీఆర్).. ఇదీ అసలు సిసలు ‘ఆర్.ఆర్.ఆర్.’ అంటే. ‘రౌద్రం రణం రుధిరం’ అంటూ ‘ఆర్ఆర్ఆర్’ (RRR Rama Raju Komaram Bheem Rajamouli) గురించి మేకర్స్ చెబుతున్నా, తెలుగు టైటిల్‌లో కూడా అదే కనిపిస్తున్నా.. సినీ ప్రేక్షకులకు మాత్రం.. పైన చెప్పుకున్న ఆర్ఆర్ఆర్ మాత్రమే గుర్తుకొస్తుంది.
నిజమే, రాజమౌళి కూడా ఓ స్టార్.. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు ఏమాత్రం తీసిపోని స్టార్‌డమ్ రాజమౌళి సొంతం. దటీజ్ రాజమౌళి (SS Rajamouli). నిజమే, రాజమౌళి ఏం చేసినా సంచలనమే. ‘బాహుబలి’తో ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాసిన రాజమౌళి, ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాతో ఏం చేయబోతున్నాడు.? అది తెలియాలంటే, అక్టోబర్ 13 వరకు వేచి చూడాల్సిందే.
నిజానికి, ఈ సినిమా 2020 జులై 30న ప్రేక్షకుల ముందుకు రావాల్సి వుంది. కానీ, కొన్ని అనివార్య కారణాలతో ఆలస్యమయ్యింది.. కరోనా దెబ్బ నేపథ్యంలో ఆ ఆలస్యం ఇంకాస్త ఎక్కువయ్యింది. ఈసారి మాత్రం పక్కా.. అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకొచ్చేస్తున్నామంటూ రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ధీమాగా చెబుతున్నారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు వైరల్‌గా మారింది. బుల్లెట్టు మీద కొమరం భీమ్ (Komaram Bheem).. అదేనండీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) దూసుకెళుతోంటే, పక్కనే రామరాజు (Rama Raju).. అదేనండీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ramcharan) గుర్రపు స్వారీ చేస్తూ వారెవ్వా అనిపిస్తున్నాడు.
ఒకరు నీరు, ఇంకొకరు నిప్పు.. ఈ ఇద్దరూ కలిసి ఏం చేశారు.? అన్నది తెరపై చూడాల్సిందే. హై ఓల్టేజ్ యాక్షన్ అయితే ఖచ్చితంగా వుండబోతోంది ఈ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో. చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తోంటే, ఎన్టీఆర్‌కి జోడీగా విదేశీ భామ ఒలీవియా మోరిస్ రంగంలోకి దిగింది.
ఇదిలా వుంటే, ఆర్.ఆర్.ఆర్. (RRR Rama Raju Komaram Bheem Rajamouli) తాజా పోస్టర్ హాలీవుడ్ సినిమాకి కాపీ.. అనే ప్రచారం జరుగుతోంది. రాజమౌళి సినిమాలకు ఇలాంటి రిఫరెన్సులు మామూలే. అయినా, రాజమౌళి ఏం చేసినా, అది సమ్‌థింగ్ స్పెషల్ అంతే.
మొత్తమ్మద, చరణ్ – ఎన్టీఆర్ – రాజమౌళి.. వెరసి ఆర్.ఆర్.ఆర్.. రికార్డుల రేసు మొదలైంది. ఎన్ని రికార్డులు బద్దలైపోతాయో.. కొత్తగా ఇంకెన్ని సంచలన రికార్డులు తెరపైకొస్తాయో.. జస్ట్ వెయిట్ అండ్ వాచ్.