Home » ‘సాహో’రే ప్రభాస్‌.. నెవ్వర్‌ బిఫోర్‌.!

‘సాహో’రే ప్రభాస్‌.. నెవ్వర్‌ బిఫోర్‌.!

by hellomudra
0 comments

బాహుబలి’ (Baahubali) అంచనాల్ని మించిన విజయాన్ని అందుకుంది. అదొక అద్భుతం (Saaho Teaser Preview). రెండు పార్ట్‌లుగా (Baahubali The Begining, Baahubali The Conclusion ఒకే కథని తీసి సంచలన విజయాన్ని అందుకోవడం ఆషామాషీ విషయం కాదు. దేశం దృష్టిని ఆకర్షించడమంటే, అసలు ఎవరూ ఊహించని అద్భుతమే.

ఓ సినిమా కోసం అన్నేళ్లు డేట్స్‌ ఇచ్చేసి, ఇంకే సినిమానీ ఒప్పుకోకపోవడమంటే, అది మామూలు విషయం కానే కాదు. ‘మిర్చి’ (Mirchi Kortala Siva) లాంటి సక్సెస్‌ అందుకున్నాక వెంటనే అలాంటివి నాలుగైదు సినిమాలు చేసేయొచ్చు.

కానీ ప్రబాస్‌ (Young Rebel Star Prabhas) అలా ఆలోచించలేదు. ఎందుకంటే ప్రభాస్ ఈజ్ సమ్ థింగ్ డిఫరెంట్.. కొంచెం కొత్తగా ఆలోచించాడు. పది సినిమాలతో వచ్చే క్రేజ్ గురించి కాకుండా.. ఒక్క సినిమా చేసినా.. అది ఇంకో లెవల్ లో వుంటే బావుంటుందని అనుకున్నాడు.

అవును, చరిత్రలో నిలిచిపోయే సినిమా చేయాలనుకున్నాడు (Saaho Teaser Preview) యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. చేశాడు. ‘బాహుబలి’ రాజమౌళి (SS Rajamouli) నుండి వచ్చిన అద్భుతం. అది అందరికీ తెలుసు. ఆ తర్వాత ఓ కమర్షియల్‌ డైరెక్టర్‌ని పెట్టుకుని సేఫ్‌ జోన్‌లో ఓ సినిమా చేయాలనే ఆలోచన ప్రబాస్‌ చేయలేదు.

అప్పుడెప్పుడో ఇచ్చిన మాటకు కట్టుబడి ‘రన్‌ రాజా రన్‌’ (Run Raja Run Sharwanand) ఫేం సుజిత్‌కి (Sujeeth) ‘బాహుబలి’ తర్వాతి సినిమా ఛాన్స్‌ ఇచ్చాడంటే, అదీ డార్లింగ్‌ (Darling Prabhas) ఘనత. ‘బాహుబలి’ కారణంగా ‘సాహో’ (Saaho) ప్రాజెక్ట్‌ రేంజ్‌ పెరిగిందా.? అంటే అవుననే అనేవారు కొందరు. కాదనేవారు ఇంకొందరు ఉన్నారు.

నమ్మకానికి కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ (Saaho Teaser Preview)

ప్రబాస్‌, సుజిత్‌ని నమ్మాడు. సుజిత్‌, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడుతున్నాడు. అలా ‘సాహో’ (Saaho) ప్రాజెక్ట్‌ బాహుబలి (Baahubali) తర్వాత అంతటి స్థాయిని నిర్మాణ దశలోనే సంతరించుకుంది. అసలీ సినిమా పూర్తయ్యేది కాదు. విడుదల గురించి మాట్లాడుకోవడం అనవసరం.. అని లెక్కలేనంత మంది పెదవి విరిచారు.

కానీ, సినిమా మీద పెదవి విరిచిన వారందరి అంచనాల్ని తల్లకిందులు చేస్తూ ‘సాహో’ (Saaho) సగర్వంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ‘బాహుబలి’ (Baahubali) తర్వాత అంతటి సిల్వర్‌ స్క్రీన్‌ వండర్‌.. అదీ తెలుగు సినిమా నుంచి ‘సాహో’ రూపంలో వస్తోందంటే, ప్రతి తెలుగు వాడూ గర్వపడాల్సిన విషయమే కదా.

ఎంత ఖర్చు చేశారు.? ఎన్ని రోజులు సినిమా తీశారు.? అనే విషయాల కంటే, ఎన్ని అంచనాల్ని మోస్తోంది.? ఎంతలా విజయం సాధించబోతోంది.? అన్నదే ముఖ్యం ఇక్కడ. ఓ సాంకేతిక అద్భుతం కోసం వందలాది మంది కష్టపడడం నిజంగా అద్భుతం.

హాలీవుడ్‌ సాంకేతిక నిపుణులు, దేశంలోని వివిధ సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులు, టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పని చేశారు.

బాహుబలి.. అంతకు మించి సాహో..

‘బాహుబలి’ (Baahubali) తో పోల్చడం సబబు కాదేమో అని కొందరు అనుకోవచ్చు కాక. కానీ, ‘బాహుబలి’ (Baahubali The Begining, Baahubali The Conclusion) ని మించి ఈ సినిమాపై అంచనాలు పెంచేసుకోవచ్చు అనే స్థాయిలో ఇప్పటికే కొన్ని ప్రోమోస్‌ బయటికి వచ్చాయి.

కొడతాడు, ఖచ్చితంగా ‘సాహో’ (Saaho Teaser Preview) తో కొడతాడు.. మళ్లీ తెలుగు సినిమా స్థాయిని ఇంకోసారి దేశ వ్యాపితం చేస్తాడు ప్రభాస్. ఇంకో అడుగు ముందుకేసి విశ్వవ్యాప్తం కూడా చేస్తాడేమో. ఆ అద్భుతం కూడా మనం చూడబోతున్నామేమో.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ (Bollywood Hindi Cinema) బ్యూటీ శ్రద్ధా కపూర్‌ (Shraddha Kapoor) ‘సాహో’లో నటిస్తోన్న విషయం విదితమే. ఆమెకి తెలుగులో ఇదే తొలి సినిమా. ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో వుండబోతోంది. పైగా, హాలీవుడ్‌ స్థాయి స్టంట్స్‌తోపాటు, రొమాన్స్‌ కూడా వుంటుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెల్సిందే.

క్రికెట్‌ ఎక్స్‌ట్రాతో పాపులర్‌ అయిన మందిరా బేడీ (Mandira Bedi), బాలీవుడ్‌ హాట్‌ బాంబ్‌ ఎవ్‌లీన్‌ శర్మ (Evelyn Sharma), నీల్‌ నితిన్‌ ముఖేష్‌ (Neil Nithin Mukesh), అరుణ్‌ విజయ్‌ (Arun Vijay).. ఇలా చెప్పుకుంటూ పోతే, సాహో నటీనటుల లిస్ట్‌ చాంతాడంత వుంటుంది. మొత్తమ్మీద, టాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హంక్‌ ప్రబాస్‌ చేయబోయే ఆ అద్భుతం కోసం ఎదురు చూద్దాం.

Also Read: ప్రభాస్ ‘సాహో’ చాప్టర్ వన్ రివ్యూ: స్టైలిష్ మేకింగ్

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group