Sachin Tendulkar 50.. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్.! ఔను, క్రికెట్ అనేది ఓ మతం అయినా కాకపోయినాగానీ, క్రికెట్ దేవుడంటే సచిన్ టెండూల్కర్ మాత్రమే.!
సచిన్ టెండూల్కర్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇస్తూనే, క్రికెట్‌కి కొత్త గ్లామర్ తీసుకొచ్చాడు. ‘సచిన్ క్రీజ్‌లో వున్నాడా.? అయితే, గెలిచేస్తాం.!’ అనే నమ్మకం వుండేది భారత క్రికెట్ అభిమానులకి.
తన క్రీడా జీవితంలో సచిన్ టెండూల్కర్ చూడని హైట్స్ లేవనడం అతిశయోక్తి కాదేమో.! వన్డే డబుల్ సెంచరీ కూడా చేసేశాడు.!
క్రికెట్‌లో ఇప్పుడు చాలామంది స్టార్లను చూస్తున్నాం.!
కానీ, సచిన్ టెండూల్కర్ లెక్కే వేరు.!
ఆయన స్టార్ కాదు.. క్రికెట్ దేవుడు.!
క్రికెట్‌కి సంబంధించినంతవరకు ఆయన ఎవరెస్టు శిఖరం.
Mudra369
పరుగుల మెషీన్.. అని సచిన్ టెండూల్కర్‌ని అభివర్ణించాల్సి వస్తే, అది అతిశయోక్తి ఎలా అవుతుంది.? సచిన్ గొప్ప ఆటగాడు మాత్రమే కాదు, గొప్ప స్ఫూర్తి.!
Sachin Tendulkar 50.. పాఠాలు నేర్పిన పెద్దన్న..
పెద్దన్నగా ఎంతో మంది యంగ్‌స్టర్స్‌కి ఆటలో పాఠాలు నేర్పించాడు.. జీవిత పాఠాలు కూడా నేర్పించాడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar).
తన యాభయ్యవ పుట్టినరోజు సందర్భంగా, ‘50 నాటౌట్’ అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేశాడు ఈ క్రికెట్ దేవుడు.

అంతర్జాతీయ క్రికెట్‌కి సచిన్ ఎప్పుడో గుడ్ బై చెప్పేశాడు. రిటైర్మెంట్ తీసుకుని చాలాకాలమే అయినాగానీ, సచిన్‌ని అభిమానించే అభిమానుల హోరు స్టేడియంలలో మార్మోగుతూనే వుంటుంది.
వారసుడొచ్చాడు.. ఔను, సచిన్ టెండూల్కర్ వారసుడు.. అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) కూడా వచ్చేశాడు.! ఇంకా నిరూపించుకోవాల్సి వుంది.. తొలి అడుగు ఐపీఎల్‌తో పడింది.!
Also Read: యుద్ధ విమానంపై హనుమాన్.! ఎందుకీ కాంట్రవర్సీ.!
అర్జున్ టెండూల్కర్ (Sachin Tendulkar) సంగతి తర్వాత.. సచిన్ టెండూల్కర్‌ని ‘టన్’డూల్కర్ అని పిలుస్తుంటాం. ‘టన్ను’ల కొద్దీ పరుగులు సాధించాడు మరి.!
సో, వందేళ్ళు సచిన్ టెండూల్కర్ (Master Blaster Sachin Tendulkar) జీవించాలంటూ అభిమానులు కోరుతున్నారు.!