Sai Dhansika Vishal Marriage.. తమిళ నటి సాయి ధన్సిక, తన పెళ్ళి గురించి సంచలన ప్రకటన చేసింది.!
తమిళ నటుడు విశాల్‌తో గత కొన్నాళ్ళుగా ప్రేమాయణంలో మునిగి తేలుతోంది సాయి ధన్సిక. ఈ ఇద్దరూ త్వరలో పెళ్ళి పీటలెక్కబోతున్నారు.
ఆగస్టు 29న ఈ జంట వైవాహిక బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ విషయాన్ని అటు సాయి ధన్సిక, ఇటు విశాల్.. ఒకే వేదికపై ప్రకటించడం గమనార్హం.
Sai Dhansika Vishal Marriage.. పెళ్ళయ్యాక కూడా సినిమాల్లో నటిస్తుందట..
సాయి ధన్సిక పెళ్ళయ్యాక కూడా నటిస్తుందంటూ విశాల్ ప్రకటించాడు. సాయి ధన్సిక చాలా మంచి అమ్మాయి అనీ, ఆమెతో స్నేహం గత కొంతకాలంగా సాగుతోదని విశాల్ చెప్పుకొచ్చాడు.
‘నడిగర్ సంఘం’ భవన నిర్మాణం తర్వాతే తన పెళ్ళి అంటూ, కొన్నాళ్ళ క్రితం విశాల్ ప్రకటించాడు. ఆ భవన నిర్మాణం ఇటీవల పూర్తయ్యింది.

‘త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నా.. పెళ్ళి విషయమై సంప్రదింపులు జరుగుతున్నాయి.. ప్రేమ పెళ్ళే జరుగుతుంది.. త్వరలోనే ప్రకటిస్తా..’ అని ఆ మధ్య ఓ ప్రశ్నకు బదులిచ్చాడు విశాల్.
కాగా, సాయి ధన్సిక ‘యోగీ దా’ అనే సినిమాలో నటించింది. యాక్షన్ మూవీ ఇది. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లోనే సాయి ధన్సిక – విశాల్ పెళ్ళిపై క్లారిటీ వచ్చింది.
Also Read: Good Bad Ugly Review: డిజాస్టర్ ‘సుడిగాడు’.!
విశాల్ గతంలో ఓ సినీ ప్రముఖుడి కుమార్తెతో ప్రేమాయణం నడిపాడు.. కానీ, ఆ కథ పెళ్ళి పీటలదాకా వెళ్ళలేకపోయింది.
కొన్నాళ్ళ తర్వాత విశాల్‌కి వేరే సంబంధం కుదిరిందిగానీ, అదీ పెళ్ళి పీటలెక్కలేదు.. ఎంగేజ్మెంట్ దశలోనే ఆగిపోయిందా బంధం.!

తెలుగు మూలాలున్న విశాల్, తమిళ సినీ పరిశ్రమలో నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు. తమిళ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశాడు.
తమిళ సినీ రాజకీయాల్లో విశాల్ ఓ సంచలనం. ఆ సంచలనాలతోపాటు, వివాదాలూ విశాల్ రెడ్డికి కొత్తేమీ కాదు.