Sai Dharam Tej Accident గంటకి 400 కిలోమీటర్ల వేగంతో బైక్ దూసుకుపోవడం సాధ్యమయ్యే పనేనా.? సోకాల్డ్ తెలుగు మీడియాలో అయితే, అది సాధ్యమే. ఓ మెరుగైన సమాజం న్యూస్ ఛానల్, మన తెలుగు నాట ఓ బైక్ ఏకంగా గంటకి 400 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళిందంటూ ప్రకటించేసింది.
కుండ పోత వర్షాన్ని, ‘రుధిరం ఊడిపడినట్టు..’ అంటూ సంబోదించిన ఘనత ఇప్పటికే ఆ న్యూస్ ఛానల్‌కి దక్కిన దరిమిలా, అసలు బైక్ స్పీడ్ అంటే ఏంటో కూడా ఆ చానల్‌కి తెలుసని ఎలా అనుకోగలం.? మన ఇండియన్ రోడ్స్ మీద ఓ బైక్ గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ఎలా దూసుకుపోతుందన్న కనీసపాటి ఇంగితం లేకపోవడమే, ఆ చానల్ చెప్పుకునే గొప్ప జర్నలిజం.
Also Read: బురదలో కూరుకుపోయిన జర్నలిజం.. సమాజానికి హానికరం.!
సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం విదితమే. రోడ్డు ప్రమాదానికి కారణం, రోడ్డు పక్కగా పేరుకుపోయిన ఇసుక అని పోలీసులు ఇప్పటికే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆ విషయాన్ని స్వయంగా పోలీసు అధికారులే చెబుతున్నారు.
సరే, సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej Accident) అతి వేగంతో, ప్రమాదకరంగా వాహనాన్ని నడిపి వుంటే, ఆ విషయమై పోలీసులు పూర్తి సమాచారం సేకరించాక ఎలాగూ వెల్లడిస్తారు. ఈలోగా, ఓ వ్యక్తిని.. తద్వారా ఓ కుటుంబాన్నీ బజారుకీడ్చేయాలన్న సదరు ఛానల్ ఎందుకు కక్కుర్తి పడుతోంది.?
Also Read: విద్యావ్యవస్థకి డబ్బు జబ్బు.. నేరమెవరిది.? శిక్ష ఎవరికి.?
నిజానికి, సదరు న్యూస్ చానల్‌కి ఇది కొత్తేమీ కాదు. అసలు, కక్కుర్తి జర్నలిజంకి కేరాఫ్ అడ్రస్ ఆ న్యూస్ ఛానల్. పైగా, మెగా ఫ్యామిలీ అంటే అస్సలు గిట్టదు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చే సినిమాల మీద దుష్ప్రచారం.. మెగా కుటుంబం నుంచి ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే దుష్పచారం.
శవాల్ని పీక్కు తినే గుంట నక్కలు, రాబందులకంటే హేయం.. ఈ జర్నలిజం. ఔను, ఇది రుధిర జర్నలిజం.