Table of Contents
Sai Pallavi Bholaa Shankar.. భోళా శంకర్’ డిజాస్టర్‌ని సాయి పల్లవి ముందుగానే ఊహించిందా.? ఆమె ఊహించినట్లుగానే ‘భోళా శంకర్’ డిజాస్టర్ అయ్యిందా.? ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా వినిపిస్తో్న్న ప్రచారమిది.
అవును..! భోళా శంకర్ (Bholaa Shankar) సినిమాలో కీర్తి సురేష్ నటించిన పాత్రకు మొదట సాయి పల్లవినే అనుకున్నారు. రీమేక్ సినిమా కావడం వల్ల నో చెప్పేసింది సాయి పల్లవి.
అలా ఆ ప్లేస్‌లోకి కీర్తి సురేష్ వచ్చి చేరింది. అయితే, రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘భోళా శంకర్’ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.
Sai Pallavi Bholaa Shankar.. సాయి పల్లవి అలా కీర్తి సురేష్ ఇలా.!
దాంతో, సాయి పల్లవి పండగ చేసుకుంటోందట.. అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై సాయి పల్లవి ఇంతవరకూ స్పందించలేదు కానీ.!
‘నేను చాలా పెద్ద తప్పు చేశానంటూ కీర్తి సురేష్ సన్నిహితుల వద్ద వాపోతోందట..’ అంటూ ఇంకో ప్రచారం తెర పైకి వచ్చింది.
అయితే, కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లు.. ‘భోళా శంకర్’ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడానికీ అనేక కారణాలున్నాయ్.

కుల, రాజకీయ జాడ్యం ‘భోళా శంకర్ (Bholaa Shanker)’ సినిమాని దారుణంగా చంపేసింది. లేదంటే, ఈ సినిమా డిజాస్టర్ అయ్యేదే కాదు.
‘ఆచార్య’ వేరు.! ‘భోళా శంకర్’ వేరు.!
అన్నీ ఆలోచించే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా ఒప్పుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 150 సినిమాలు చేసిన అనుభవం ఆయనది.
ఎలాంటి సినిమా అయితే, అభిమానుల్ని అలరిస్తుందో అంత తెలియకుండా వుంటుందా.? ‘ఆచార్య’ డిజాస్టర్ అయ్యిందంటే అది వేరే ముచ్చట.
డైరెక్టర్‌పై నమ్మకంతో చిరంజీవి (Mega Star Chiranjeevi) ఆ సినిమా చేశారు. డైరెక్టర్ అడ్డంగా ముంచేశాడు. కానీ, ‘భోళా శంకర్ ( (Bholaa Shankar)’ విషయంలో లో అన్నీ దగ్గరుండి చూసుకున్నారు చిరంజీవి.
మెగాస్టార్ అన్నీ తానై..
చాలా బాధ్యతగా వ్యవహరించారు. కాస్టింగ్ దగ్గర్నుంచీ, మేకింగ్ వరకూ చివరిగా ప్రమోషన్లు కూడా అంతా తన భుజాలపై వేసుకుని మోశారాయన.
ఏది ఏమైతేనేం, నెగిటివిటీనే నెగ్గింది. ఒక్కోసారి టైమ్ బ్యాడ్ అంతే.! ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు అలా జరుగుతుంటాయంతే.
ఇక, కీర్తి సురేష్ (Keerthy Suresh) విషయానికి వస్తే, ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల ఆమెకు పెద్దగా నష్టమేమీ లేదు. మంచి రెమ్యునరేషన్ ముట్టింది.
Also Read: అప్పుడూ.. ఇప్పుడూ నన్నే తిడుతున్నారు: రేణుదేశాయ్
మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) తో సమానమైన స్ర్కీన్ స్పేస్ దక్కింది. ఈ రోజుల్లో హీరోయిన్లకు అంతకన్నా అదృష్టం ఇంకేం కావాలి. కావాలంటే వస్తుందా ఆ స్థాయిలో మెగా ఛాన్స్.!
సో, తప్పు చేశానంటూ కీర్తి సురేష్ (Keerthy Suresh) విషయంలో జురుగుతున్న ప్రచారంలో అర్ధం లేదు. ఇక, సాయి పల్లవి (Sai Pallavi) అంటారా.! ఆమెనీ తప్పు పట్టలేం. బేసిగ్గా అటువంటి వ్యక్తిత్వం కానే కాదు సాయి పల్లవిది.