Sai Pallavi NC23 Nagachaitanya.. సినిమాల్లో సందర్భోచితంగా కాస్త మేకప్‌తో కనిపిస్తుందేమోగానీ, రియల్ లైఫ్‌లో అస్సలు మేకప్ వేసుకోదామె.!
పరిచయం అక్కర్లేని పేరది.! సాయి పల్లవి.! ‘ఫిదా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సాయి పల్లవి, కెరీర్‌లో కొన్ని హిట్ సినిమాలు చేసింది.. కొన్ని ఫ్లాప్ సినిమాల్లోనూ నటించింది.
హిట్లు.. ఫ్లాపులు ఎలా వున్నా.. నటిగా ఏనాడూ సాయి పల్లవి (Sai Pallavi) ఫెయిల్ కాలేదు.! సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ సాయి పల్లవి.
అందుకేనేమో, సాయి పల్లవి పనైపోయిందనే ప్రచారం జరిగిన ప్రతిసారీ ఆమె తనదైన స్టయిల్లో బౌన్స్ బ్యాక్ అవుతుంటుంది.
Sai Pallavi NC23 Nagachaitanya.. ‘లవ్ స్టోరీ’ తర్వాత ఇంకోస్సారి.!
తాజాగా, నాగచైతన్య సరసన ఇంకోసారి నటించబోతోంది సాయి పల్లవి. గతంలో ఈ ఇద్దరూ ‘లవ్ స్టోరీ’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న తాజా సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహించనున్నాడు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతానికైతే ‘ఎన్‌సి23’ అనే పేరుతో ఈ ప్రాజెక్టుని పిలుస్తున్నారు.

పాన్ ఇండియా మూవీగా ఈ ప్రాజెక్టుని తెరకెక్కించనున్నారట. సాయి పల్లవితో సినిమా అంటే, ఆమెకి కొన్ని కండిషన్స్ వుంటాయ్. కథ నచ్చాలి.!
అందుకే, సాయి పల్లవితో అటు దర్శకుడు, ఇటు నిర్మాత, ఇంకో పక్క హీరో నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) కలిసి సిట్టింగ్‌లో పాల్గొన్నారు.
Also Read: పచ్చ బొట్టూ చెరిగీపోదూలే.! కానీ, అక్కడే ఎందుకు.?
కథ విన్న అనంతరం, సాయి పల్లవి చాలా చాలా ఎక్సైట్ అయ్యిందట. నిర్మాత అల్లు అరవింద్ చేతుల మీదుగా, ‘అడ్వాన్స్ పేమెంట్’ కూడా గట్టిగానే అందుకున్నట్టుంది సాయి పల్లవి.!
ఆ డ్రెస్సింగ్ స్టయిల్.. ఆ నేచురల్ లుక్.. వీటన్నిటికీ ఆమె అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ‘లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి’ అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.