Sai Pallavi Slams Rumors.. కోపం రాదా మరి.? పెళ్ళంటూ పుకార్లు సృష్టించడమేంటి మొహం పగలగొట్టేవాడు లేకపోతే.!
లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) ఎప్పుడూ కూల్ అండ్ లవ్లీగా కనిపిస్తుంటుంది. కానీ, ఈసారి ఆమె చాలా సీరియస్ అవుతోంది.
లీగల్ యాక్షన్‌కి కూడా రెడీ అవుతోందిట. సాయి పల్లవి (Sai Pallavi) మీద దుష్ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తప్పవట.
Sai Pallavi Slams Rumors.. పెళ్ళి.. నిజమెంత.?
ఓ సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించిన పూజా కార్యక్రమాల తాలూకు ఫొటోని ‘క్రాప్’ చేసి, సాయి పల్లవికి పెళ్ళయిపోయిందంటూ కొందరు పుకార్లు సృష్టించారు.
ఈ వ్యవహారంపై సాయి పల్లవి స్పందించింది. సాధారణంగా చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోననీ, కానీ.. ఇది క్షమించరాని నేరమనీ సాయి పల్లవి వ్యాఖ్యానించింది.

సోషల్ మీడియా వేదికగా, ‘పెళ్ళి పుకార్లపై’ స్పష్టతనిచ్చిన సాయి పల్లవి, ఫేక్ వార్తల్ని ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.
Also Read: కృతి సనన్.! బోల్డ్ అండ్ వైల్డ్ యాక్షన్.!
అయినా, సినీ తారలకు ఈ తరహా వివాదాలు కొత్తేమీ కాదు.! వాళ్ళెంతగా నెత్తీ నోరూ బాదుకుంటున్నా, పుకార్లు మాత్రం ఆగవు.
పైగా, పెళ్ళి పుకార్లకి మార్కెట్లో క్రేజ్ ఎక్కువ. అందుకే, పూటకో పుకారు పుట్టుకొస్తుంటుంది. పెళ్ళి పుకార్లే కాదు, ఎఫైర్ పుకార్లు కూడా అంతే.!