Samantha Nagachaitanya Divorce Controversy.. ‘శాకుంతలం’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇస్తోన్న ఇంటర్వ్యూల్లో సమంత సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. అదీ విడాకుల వ్యవహారానికి సంబంధించి.!
అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్ళి చేసుకోవడం, ఆ తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకోవడం తెలిసిన విషయాలే. విడాకుల వ్యవహారానికి సంబంధించి సమంతని దారుణంగా కొందరు ట్రోల్ చేశారు.
అలా విడాకులు.. ఇలా ‘పుష్ప’లో ఐటమ్ సాంగ్.. బంధువులు, స్నేహితులు ఫోన్ చేసి మరీ తిట్టారట.!
విడాకుల విషయంలో తప్పెవరిది.? నేనేం తప్పు చేయలేదంటున్న సమంత.!
నిజాయితీగా వున్నా నాగచైతన్యతో వైవాహిక జీవితం వర్కవుట్ అవలేదంటూ సెటైర్లు.!
ఎందుకీ కెలుకుడు.? సంచలన వ్యాఖ్యలు.. వివాదం కోసమేనా.?
Mudra369
అదే సమయంలో అక్కినేని నాగచైతన్య మీద కూడా విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఇద్దరి మీదా ఇంకా విడివిడిగా ట్రోలింగ్ జరుగుతూనే వుంది.
Samantha Nagachaitanya Divorce Controversy.. తప్పు చేయలేదు.. ఎందుకు భయపడాలి.?
విడాకుల తర్వాత ‘పుష్ప’ సినిమాలో ఐటమ్ సాంగ్ చేశానన్న సమంత, ఆ సాంగ్ చేయొద్దని చాలామంది హెచ్చరించారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

‘నాకు ఫోన్ చేసి చాలామంది తిట్టారు. అందులో కుటుంబ సభ్యులు, సన్నిహితులే ఎక్కువ. నేనేమీ తప్పు చేయలేదు. నేనెందుకు భయపడాలి.?’ అని సమంత వ్యాఖ్యానించింది.
గడచిన రెండేళ్ళలో జీవితంలో చాలా నేర్చుకున్నాననీ, మానసికంగా అలాగే శారీరకంగా మరింత ధృఢపడ్డానని సమంత (Samantha Ruth Prabhu) చెప్పుకొచ్చింది.
నిజాయితీగా వున్నాను.. కానీ, విడాకులు తప్పలేదు..
వైవాహిక బంధంలో తాను చాలా నిజాయితీగా వున్నాగానీ, అది తనకు వర్కవుట్ కాలేదని సమంత చెప్పడం గమనార్హం. అంటే, అక్కినేని నాగచైతన్య నిజాయితీగా లేడనే అర్థమా.?
అంతే కదా.. రాజుగారి మొదటి భార్య మంచిదని నొక్కి వక్కాణిస్తే.. రెండో భార్య చెడ్డదనే అర్థం చేసుకోవాలేమో.!
నిజమే.! విడాకుల విషయంలో వింతేముంది.? ఈ రోజుల్లో ఇదంతా కామన్. కాకపోతే, విడాకుల వ్యవహారంపై నాగచైతన్య కూడా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు.
అయితే, నాగచైతన్య (Akkineni Naga Chaitanya) ఎక్కడా ఇంతవరకూ విడాకుల గురించి ఎలాంటి వివాదాస్సద లేదా సంచలన వ్యాఖ్యలు చేసింది లేదు. అతని పని అతను చేసుకుపోతున్నాడు.
Also Read: Ritu Varma.. భామవే.. సత్యభామవే.!
సమంత (Samantha Ruth Prabhu) మాత్రం సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. మహిళ కావడంపై ఆమెపై ఒకింత ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతున్నమాట వాస్తవం.
అయితే, మీడియా అటెన్షన్ కోసమే మహిళ సంచలన వ్యాఖ్యలు చేస్తోందన్న విమర్శలు లేకపోలేదు. తప్పెవరిది.? అని విడాకుల వ్యవహారంలో తేల్చడం కష్టం.!