Samantha Ruth Prabhu Glamour Attack: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని స్థానంలో వుంది సమంత. అందులో నో డౌట్. సమంత రీసెంట్‌గా చేసిన ‘పుష్ప’ సినిమాలోని ‘ఊ అంటారా.. ఊ ఊ అంటారా’ పాటకి వచ్చిన ఊపు ఏ పాటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
సరే, ఆ విషయం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు హాట్ టాపిక్ ‘సమంత అందాల దాడి’. ఇది సమంత కొత్త సినిమా టైటిలేమైనా అనుకుంటున్నారా.?. ఆగండాగండి.. అసలు విషయం వేరే వుంది.
Samantha Ruth Prabhu Glamour Attack.. సమంత కూడా ఊహించని కిక్కు
ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సమంత అందరి కళ్ళనూ తనవైపుకు తిప్పుకునేలా చేసింది. నెవర్ బిఫోర్.. అన్నట్టుగా హాటుగా.. చాలా చాలా ఘాటుగా.. కనిపించి చూసేవాళ్ళకి ‘స్వీటు’గా షాకిచ్చింది. అన్నట్టు, ఈ ఈవెంట్‌లో సమంతకు కొన్ని విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయ్.
మెరుపుతీగలా మెరిసిపోయిన సమంతను (Samantha Ruth Prabhu) చూసి మైమర్చిపోతూనే, ఆమెపై ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు మీడియా జనాలు.
ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించీ, ఇతరత్రా విషయాల గురించీ, పనిలో పనిగా ‘ఊ అంటారా..’ పాట గురించీ ప్రశ్నలు దూసుకెళ్ళాయి సమంత వైపు. సమంత కూడా ఆ ప్రశ్నలకు తనదైన స్టయిల్లో సమాధానాలిచ్చింది.
‘అంతకు ముందే నేను చాలా సినిమాల్లో.. చాలా చాలా మంచి పాత్రల్లో కనిపించినా.. వాటన్నిటినీ మర్చిపోయి అందరూ ఈ స్పెషల్ సాంగ్‌నే గుర్తుపెట్టుకున్నారు..’ అంటూ సమంత ఆశ్చర్యపోయింది.

‘ఏదో క్యాజువల్‌గా ఈ సాంగ్‌లో నటించాను. ఆ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తుందని నేను కూడా ఊహించలేదు.. అందరూ ఈ పాట గురించే అడుగుతున్నారు.. చాలా హ్యాపీగా వుంది..’ అంటూ సమంత (Samantha Ruth Prabhu) రెస్పాండ్ అయ్యింది.
షో స్టాపర్: మైండ్ బ్లోయింగ్ గ్లామర్ సందడి
ఇక, ఈవెంట్‌లో సమంత (Samantha Ruth Prabhu) లుక్ విషయానికి వచ్చేద్దాం. ప్రీతమ్ జుకాల్కర్ (సమంత పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్) డిజైన్ చేసిన బ్రైట్ గ్రీన్ కలర్ డిజైనర్ వేర్ ధరించి ఈ ఈవెంట్‌లో సమంత చేసిన గ్లామర్ సందడి మైండ్ బ్లోయింగ్.
షో స్టాపర్‌గా నిలిచింది సమంత అనడం అతిశయోక్తి కాదేమో. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అయిపోతున్నాయ్ సమంత పిక్స్. కాగా, కొందరు సమంతను (Samantha) ఈ విషయమై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంకొందరు సమంత అందాన్ని ఆరాధించేస్తున్నారు.
Also Read: హేయ్ అవంతిక.! నీలో చాలా విషయం వుందే.!
నాగచైతన్యతో (Akkineni Naga Chaitanya) విడాకుల అనంతరం ఇలాంటి గ్లామర్ షాకులు ఒకదాని మీద ఇంకొకటి అన్నట్లుగా ఇస్తూనే వుంది సమంత. అన్నింటికీ మించి అనే రేంజులో వుందీ రీసెంట్ గ్లామర్ హంగామా.
అన్నట్లు ప్రీతమ్ జుకాల్కర్.. ఈ మహానుభావుడి కారణంగానే సమంత, నాగచైతన్య దాంపత్యంలో చిచ్చు రేగిందనీ, అదే ఈ ఇద్దరూ విడిపోవడానికి కారణమయ్యిందనే రూమర్ (Samantha Ruth Prabhu Glamour Attack) ప్రచారంలో వున్న సంగతి తెలిసిందే.