Samantha Ruth Prabhu Politics.. అరరె.! సమంత రాజకీయాల్లోకి వచ్చేస్తుందట.! ప్రత్యక్ష రాజకీయాల్లోకి సమంత రాబోతోందంటూ ప్రచారం జరుగుతున్న వేళ, ఆమె ఎప్పటిలానే మౌనం దాల్చింది.!
అయినా, ఎందుకు స్పందించాలి.? ఈ తరహా గాసిప్స్ సమంతకి కొత్తేమీ కాదు. 2019 ఎన్నికల్లోనే, సమంత అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి పోటీ చేస్తుందనే ప్రచారం జరిగింది.
కానీ, సమంత రాజకీయాల్ని లైట్ తీసుకుంది. తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పేసింది. ఏ రాజకీయ పార్టీ తరఫున ప్రచారానికీ కూడా ఆమె సుముఖత వ్యక్తం చేయలేదు.
Samantha Ruth Prabhu Politics.. సినిమా.. రాజకీయం.. వేర్వేరు కాదు.!
సినిమాలు వేరు, రాజకీయాలు వేరు.. అని అనడానికి వీల్లేదు. సినీ ప్రముఖులు రాజకీయాల్ని శాసించిన సందర్భాలనేకం.
అలాగని, సినీ జనాలంతా రాజకీయాల్లోకి వచ్చేస్తారనడమూ సబబు కాదు.! సమంత (Samantha Ruth Prabhu) ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది.

సినిమాలు చేయడమే సమంతకి కష్టంగా మారింది. రాజకీయాలంటే మాటలా.? ఎండనకా.. వాననకా.. తిరగాలి. అవన్నీ సాధ్యమయ్యే పని కాదు ప్రస్తుతం సమంతకి.
అప్పుడెప్పుడో అలా..
కొన్నేళ్ళ క్రితం.. తెలంగాణలో చేనేతకు మద్దతుగా సమంత పలు కార్యక్రమాలు చేపట్టింది. అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పటి భారత్ రాష్ట్ర సమితి) ఆమెకు స్పెషల్ కవరేజ్ కూడా ఇచ్చింది.
Also Read: Pawan Kalyan.. ఏంటి పవన్ కళ్యాణ్ నీ గొప్ప.?
అంతే, అది తప్ప.. సమంత రాజకీయ తెరపై కనిపించింది లేదు. సామాజిక బాధ్యతలో భాగంగానే సమంత, చేనేతకు అండగా వుంది.. అనుకోకుండా అది రాజకీయంగా బోల్డంత హంగామాకి కారణమయ్యిందంతే.

ఇక, సినిమాల విషయానికొస్తే, ఇటీవల ‘ఖుషీ’ సినిమాలో కనిపించిందామె. నానా కష్టాలూ పడింది సినిమాని పూర్తి చేయడానికి. కారణం, మయోసైటిస్ అనే అనారోగ్య సమస్యే.
మరోపక్క, ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ (ఇండియన్ వెర్షన్)లోనూ సమంత నటించింది. అదింకా స్ట్రీమింగ్ అవ్వాల్సి వుంది. కొన్ని ఒప్పుకున్న సినిమాల్ని సమంత పక్కన పడేయక తప్పలేదు.