Samantha Special Song.. సన్నీలియోన్‌తో సమంతని పోల్చవచ్చా.? పోల్చకూడదా.? ఎందుకు పోల్చకూడదు.! సన్నీలియోన్ ఐటమ్ సాంగ్స్ చేసింది.. చేస్తోంది. సమంత కూడా ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఆ కోణంలో ఇద్దర్నీ పోల్చడం తప్పేమీ కాదు. సరే, ఈ విషయమై కొందరు సమంత అభిమానులు గుస్సా అవుతున్నారనుకోండి.. అది వేరే సంగతి.
అసలు విషయమేంటంటే, ‘పుష్ప’ సినిమా కోసం సమంత ఐటమ్ బాంబుగా మారిన విషయం తెల్సిందే. ఈ స్పెషల్ సాంగ్ కోసం సమంత ధరించిన కాస్ట్యూమ్.. గతంలో సన్నీలియోన్ ధరించిన కాస్ట్యూమ్‌లాగానే వుంది. ఇంకేముంది.? సమంత, సన్నీలియోన్‌లా మారిపోయిందంటూ ‘ట్రోలింగ్’ షురూ అయ్యింది.
Samantha Special Song బోల్డ్ అండ్ బ్యూటిఫుల్

సమంత మంచి డాన్సర్.. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే, హీరోయిన్‌గా ఎన్నో సినిమాలు చేసి.. బోల్డంత స్టార్‌డమ్ సంపాదించుకున్న సమంత, నిఖార్సయిన డాన్సింగ్ నెంబర్ చేయలేకపోయాననే భావనతో వుండేది నిన్న మొన్నటిదాకా. ఇకపై ఆమెకు ఆ ఒక్క లోటూ తీరిపోయినట్టే.
అదేంటీ, పెళ్ళయ్యాక సమంత గ్లామర్ తగ్గించేసింది కదా.? ఇప్పుడు విడాకుల తర్వాత మళ్ళీ ఎందుకు హాట్ షో షురూ చేస్తున్నట్లు.? అన్న డౌటానుమానాలు చాలామందికి వస్తున్నాయి. నిజానికి, ఈ నయా ట్రెండ్‌లో అలాంటి చిన్న చిన్న విషయాల్ని నటీమణులు అస్సలు పట్టించుకోవడంలేదు.
Also Read: Malaika Arora సొగసైన వ్యాపారం.!
అన్నట్టు, సమంత ఓ ఇంగ్లీషు సినిమాకి కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమాలు, బాలీవుడ్ సినిమాలు, తమిళ సినిమాలు, కొత్తగా ఇంగ్లీషు సినిమా.. సమంత (Samantha Special Song) జోరు మామూలుగా లేదు.. నాగచైతన్యతో విడాకుల తర్వాత.