ప్రభుదేవాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నప్పుడు నయనతార ఓ స్పెషల్ టాటూ వేయించుకుంది. ఆ ప్రేమ గల్లంతయ్యింది. ప్రేమలో ఉన్నప్పుడు చిహ్నంగా వేయించుకున్న ఆ టాటూ పరిస్థితి ఏమైందో తర్వాత మాట్లాడుకుందాం. నయనతారలానే సమంత (Samantha Ruth Prabhu) కూడా చైతూతో ప్రేమలో ఉన్నప్పుడు (చైతూను (Akkineni Naga Chaitanya) పెళ్లాడిన తర్వాత) టాటూ (Samantha Tattoo) వేయించుకుంది.
ప్రభుదేవాని (Prabhu Deva) మర్చిపోయింది నయనతార. కానీ, ప్రభుదేవాపై ప్రేమతో వేయించుకున్న పచ్చబొట్టును చెరిపేసుకోలేకపోయింది నయనతార (Nayanthara). అందుకే ఆ పాత పచ్చబొట్టుకు కాస్త మెరుగులు దిద్ది, కొత్త టాటూలా మార్చేసుకుంది. మరి, సమంత (Samantha Akkineni) ఏం చేయబోతోంది.? టాటూ చెరిపేసుకుంటుందా.? పాత టాటూకు అదనంగా ఏమైనా మార్పులు చేయిస్తుందా.?
పచ్చ బొట్టూ చెరిగిపోద్దిలే..
ఈ పచ్చబొట్టు గోలేంటీ.? సెలబ్రిటీలు కదా. ప్రతి విషయం మీదా జనాలకి ఆసక్తి ఉంటుంది.? సోషల్ మీడియా వేదికగా బోలెడంత రచ్చ జరుగుతుంది. ‘మా వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడొద్దు..’ అని ఇలాంటి విషయాల్లోనే సెలబ్రిటీలు గుస్సా అవుతుంటారు.
Also Read: సూటిగా, సుత్తి లేకుండా.. దటీజ్ సమంత
అయితే, ప్రేమ చిహ్నాలుగా పర్మినెంట్ టాటూ వేయించుకుని, ఆ టాటూ గొప్పతనం గురించి ఇంకా గొప్పగా చెప్పి పబ్లిసిటీ చేసుకున్నప్పుడు అవి చెరిపేసుకోవల్సిన సందర్భాలు వస్తే, వాటిపై చర్చ జరగకుండా ఎందుకుంటుంది.? జనం మాట్లాడుకోకుండా ఎందుకుంటారు.?
ఇది నయా ట్రెండేమీ కాదుగానీ..
టాటూ (Tattoo) అనేది నయా ట్రెండ్ ఏమీ కాదు. పచ్చబొట్టు పాత కాలం నుంచీ ఉన్నదే. అప్పటికీ, ఇప్పటికీ చాలా తేడా. అప్పట్లో మార్చుకోవడానికి వీలుండేది కాదు. ఇప్పుడు కొంచెం కష్టపడితే, పర్మినెంట్ టాటూను కూడా చెరిపేసుకోవచ్చు.
Also Read: Nayanthara – Vignesh Shivan పెళ్ళి పాట్లు.!
సెలబ్రిటీలే కాదు, సామాన్యులు కూడా టాటూ వేయించుకోవడాన్ని ఓ హోదాగానో, ఓ గొప్పగానో భావిస్తున్నారు. వేయించుకోవడం సులువే. చెరిపేసుకోవల్సి వస్తేనే కష్టం. ఏ కారణంతోనైనా గుండెల్లో పెట్టుకున్న వ్యక్తిని మర్చిపోవాల్సి వస్తే, మర్చిపోవడం కష్టమే అయినా అసాధ్యం కాకపోవచ్చు. టాటూతోనే (Samantha Tattoo) వస్తోంది అసలు చిక్కు.
– BeeyeS