Table of Contents
Samantha Yashoda సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘యశోద’ సినిమాలో ‘సరోగసీ’ వ్యవహారం చుట్టూ ఇంట్రెస్టింగ్ కథని అల్లారు.!
నిజానికి, అది పూర్తిగా సరోగసీ అంశానికి సంబంధించినది మాత్రమే కాదు.. అంతకు మించి.!
హ్యూమన్ ఫ్యూటస్ (గర్భస్త శిశువు) ద్వారా ‘అందాన్ని’ పెంపొందించుకునే ఓ ‘డ్రగ్’ తయారు చేస్తారు ఆ సినిమాలో.! నిజ జీవితంలో ఇది సాధ్యమేనా.?
కాదేదీ కవితకనర్హం.. అన్న చందాన, అన్నటినీ సౌందర్య ఉత్పత్తుల కోసం వాడేస్తున్నారు. కోడిగుడ్డు నుంచి.. అన్నీ ఇందుకు ఉపయోగపడుతున్నాయి.
Samantha Yashoda.. మరీ భయపెట్టేస్తున్నారు కదా.!
నిజానికి ‘యశోద’ అనేది ఓ సినిమా మాత్రమే. అందులో పాత్రలు కల్పితం.. కథ కూడా కల్పితమే. కానీ, సరోగసీ వ్యవహారాలు నడుపుతున్న ఓ ఆసుపత్రి, ఆ సినిమాపై కోర్టును ఆశ్రయించింది.
పేరు విషయమై సదరు సరోగసీ ఆసుపత్రి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ సినిమా వల్ల తమ రెప్యుటేషన్ తగ్గిపోతుందనేది సదరు ఆసుపత్రి యాజమాన్యం ఆవేదన.
వివాదం సెటిలయ్యింది.. సినిమాలోంచి ఆ సంస్థ పేరుని తొలగించారు.
సరోగసీ అంటే వ్యాపారమే కదా.?
డబ్బున్నోళ్ళంతా అలాగే వుంటారనుకోవడం పొరపాటు. కానీ, కొందరున్నారు. డబ్బు పారేస్తే ఏమైనా తెచ్చుకోవచ్చని. పిల్లల్ని కనే విషయంలోనూ అంతే.!

డబ్బు పారేస్తున్నారు, వారసుల్ని తెచ్చేసుకుంటున్నారు. వాళ్ళే సరోగసీ ఆసుపత్రులకు రాజపోషకులు. ఇక, బ్యూటీ ప్రోడక్ట్స్ మాటున జరుగుతున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.
ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయ్.?
ఔను కదా.? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయ్.? ఏమీ చెయ్యవు. చేసినట్లు అప్పుడప్పుడూ నటిస్తుంటాయంతే.! లేకపోతే, సమాజంలో ఇన్ని అక్రమాలెందుకు జరుగుతాయ్.?
Also Read: వైరల్.! గుండ్రంగా ఎందుకు తిరుగుతున్నాయ్ గొర్రెల్.?
మీడియా సైతం ఇందులో దోషిగా మారిపోతోంది. జస్ట్ ఆర్థిక అవసరాల నిమిత్తం.. అడ్డగోలు వ్యాపార ప్రకటనలకు తలొగ్గుతున్నాయ్ మీడియా సంస్థలు. అక్కడే వస్తోంది అసలు సమస్య అంతా.
ప్రజలకు మంచి చెడు చెప్పాల్సిన మీడియా పక్కదారి పడుతోంది. ఆ మీడియా మళ్ళీ రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే నడుస్తోంది.
సినిమాలు కొన్ని కల్పితం కావొచ్చు. కానీ, వాటిల్లో కొన్ని పాత్రలు నిజం. జస్ట్ సినిమా కాదు.. యశోద.. అంతకు మించి.!