Samyuktha Menon Telugu Cinema.. ‘భీమ్లానాయక్’ సినిమతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్, మరో బంపర్ ఆఫర్ తన ఖాతాలో వేసుకుంది.
ఈసారి కూడా పవన్ కళ్యాణ్ తాజా సినిమాలో సంయుక్త మీనన్ అవకాశం దక్కించుకుందట.
మలయాళ సినిమా ‘అయ్యప్పనుం కోషియం’ తెలుగు రీమేక్ ‘భీమ్లానాయక్’ కాగా, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించింది.
రానా దగ్గుబాటి భార్యగా సంయుక్త మీనన్ ‘భీమ్లానాయక్’లో కనిపించిన సంగతి తెలిసిందే. ‘భీమ్లానాయక్’ సినిమాలో సంయుక్త నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
తొలి తెలుగు సినిమా విడుదల కాకముందే, తెలుగులో మాట్లాడేటం నేర్చేసుకున్న సంయుక్త, ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలుగులో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
Samyuktha Menon Telugu Cinema పవన్ కళ్యాణ్ సినిమాలో ఇంకోస్సారి.!
తాజాగా, సంయుక్త మీనన్.. పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలో నటించబోతోందిట. సముద్ర ఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తోన్న సినిమా కోసం సంయుక్త మీనన్ పేరుని ఖరారు చేశారట.

సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ ఈ సినిమాలో నటించబోతోంది. పవన్ కళ్యాణ్‌కి ఈ సినిమాలో హీరోయిన్ వుండదు. సముద్ర ఖని నటించి దర్శకత్వం వహించిన ‘వినోదయ సితం’కి ఇది తెలుగు రీమేక్.!
ఇదిలా వుంటే, మలయాళ సినిమా ‘కడువా’లోనూ సంయుక్త మీనన్ (Samyuktha Menon) నటించింది. తెలుగులో ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ విడుదల కాబోతోంది.
Also Read: ‘పుష్ప ది రూల్’లో ‘కేజీఎఫ్’ ట్విస్ట్.! ఔనా.? నమ్మొచ్చా.?
మొత్తమ్మీద, పవన్ కళ్యాణ్ సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ నటించే ఛాన్స్ సంయుక్త మీనన్‌కి (Samyuktha Menon Tollywood) దక్కిందన్నమాట.
పవన్ కళ్యాణ్ భావజాలం పట్ల కూడా సంయుక్త మీనన్ ఆకర్షితురాలైందనే భావన ‘భీమ్లానాయక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలతో స్పష్టమయ్యింది.