Seerat Kapoor Save The Tigers 2 ‘బుజ్జీమా.. బుజ్జీమా..’ అంటూ ‘రన్ రాజా రన్’ సినిమాలో క్యూట్ లుక్స్‌తో కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టేసిన ముద్దుగుమ్మ సీరత్ కపూర్ గుర్తుందిగా.!
ఆ తర్వాత ‘రాజుగారి గది 2’ సినిమాలో ఏకంగా కింగ్ నాగార్జున సరసన నటించింది. అలాగే ‘టచ్ చేసి చూడు’ సినిమా కోసం మాస్ రాజా రవితేజతోనూ స్ర్కీన్ షేర్ చేసుకుంది సీరత్ కపూర్.
కానీ, స్టార్‌డమ్ దిశగా పరుగులు తీయలేకపోయింది. చిన్నా చితకా సినిమాలతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది రింగు రింగుల జుట్టు బ్యూటీ సీరత్ కపూర్.
Seerat Kapoor Save The Tigers 2.. బుజ్జీమాలో ఈ కళ కూడా వుందే.!
చేసిన పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కువుట్ కాకపోయేసరికి రేస్‌లో జోరందుకోలేకపోయిందీ ముంబయ్ ముద్దుగుమ్మ.

అన్నట్లు సీరత్ కపూర్ కేవలం నటి మాత్రమే కాదండోయ్.! మంచి కొరియెగ్రాఫర్ కూడా. ఇండస్ర్టీలో మంచి కొరియోగ్రాఫర్‌గా సెటిలవ్వాలనుకుంది.
హిందీలో ఓ సినిమాకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా తన టాలెంట్ చూపించింది కూడా. సీరత్ డాన్సుల్లో ఆ ఈజ్ ఆ స్టైల్ అందుకేనేమో.!
కానీ, అదృష్టం అమ్మడిని హీరోయిన్ దిశగా మళ్లించింది. హీరోయిన్ ఫీచర్స్ పుష్కలంగా వున్న అందగత్తే సీరత్ కపూర్. కానీ, టైమ్ కలిసి రావడం లేదంతే.
గ్లామరస్.. నో లిమిట్స్.!
గ్లామర్‌లో ఎలాంటి హద్దుల్లేవ్ పాపం పాపకి. ఎంతటి పొట్టి దుస్తుల్లోనైనా.. ఇంకెంతటి గ్లామర్ లుక్స్‌లో అయినా కనిపించడానికి ఆల్వేస్ రెడీ అంటుంది అందాల సీరత్ కపూర్.

లాంగ్ గ్యాప్ తర్వాత తాజాగా ‘భామా కలాపం 2’ సినిమాలో కనిపించింది. ఓటీటీ వేదికగా ఇటీవలే రిలీజైన ఈ సినిమాలో ప్రియమణి లీడ్ రోల్ పోషించగా.. సీరత్ కపూర్ ఓ కీలక పాత్రలో కనిపించింది.
కానీ, సీరత్ పాత్రను కేవలం అందాలారబోతకే వాడినట్లున్నాడు డైరెక్టర్. చూపించాల్సినంత హాట్‌నెస్ చూపించి.. అర్ధాంతరంగా ఆ క్యారెక్టర్‌ని ముగించేశాడు.
Also Read: Kriti Kharbanda.. ఛీ.. పాడు.! కుక్కతో లిప్ లాక్ ఏంటి పాపా.!
అలా రాక రాక వచ్చిన ఛాన్స్ అయినా సీరత్‌కి ఈ ఓటీటీ సినిమా ద్వారా పెద్దగా కలిసొచ్చిందేమీ లేదనే చెప్పాలి. అన్నట్లు..
లేటెస్ట్‌గా ‘సేవ్ ద టైగర్స్ 2’ వెబ్ సిరీస్‌లోనూ సీరత్ కపూర్ కనిపించింది. ప్రస్తుతం ఓటీటీలో స్ర్టీమింగ్ అవుతోన్న ఈ వెబ్ సిరీస్‌లో సీరత్ ‘హంసలేఖ’ పాత్రలో తన రియల్ క్యారెక్టరే పోషించింది.
సినిమా హీరోయిన్ ‘హంస లేఖ’ పాత్రలో విచ్చల విడిగా అందాలారబోసింది. అదేంటో.! సీరత్ అంటేనే ఆ తరహా పాత్రలే పుట్టుకొస్తున్నాయ్ మేకర్ల మదిలో.

ఈ సిరీస్‌కి పాజిటివ్ రెస్పాన్సే వస్తోంది ప్రేక్షకుల నుంచి. అందాల ఆరబోత పక్కన పెడితే, సీరత్ కపూర్ పాత్ర కూడా బాగానే కనెక్ట్ అవుతోంది.
కేవలం అందాల ఆరబోతే కాదు, సీరత్ కపూర్ ఇంకేదో చేయాల్సి వుంది. తనను తాను నటిగా ప్రూవ్ చేసుకునేందుకు.! తప్పదు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఆ దారిలో రిస్క్ చేయాల్సిందే.!
ఏధి ఏమైతేనేం, అప్పుడప్పుడూ కనిపించినా సీరత్ కపూర్ అప్పియరెన్స్ కుర్రకారుకు ఆల్వేస్ కిక్కే కిక్కు.! ఇది మాత్రం పక్కా.!