Self Driving Car.. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పలేదన్నట్టు.. డ్రైవర్ అవసరం లేని కార్లు అందుబాటులోకి వస్తున్నా, ట్రాఫిక్ చలాన్ల గురించి ఆలోచంచడమేంటి.? ఎందుకంటే, ట్రాఫిక్ చలాన్లు అంతలా సామాన్యుల్ని వెంటాడుతున్నాయి మరి. సరే, సరిగ్గా వాహనాల్ని నడిపితే ట్రాఫిక్ చలాన్లు కట్టాల్సిన అవసరమేంటన్నది వేరే చర్చ.
ఇప్పుడిక్కడ మనం డ్రైవరు అవసరం లేని కార్ల గురించి మాట్లాడుకుంటున్నాం. 2021లో ఈ కార్ల గురించిన చర్చ చాలా చాలా ఎక్కువగానే జరిగింది. చాలా కంపెనీలు ప్రయోగాలు చేశాయి, చేస్తూనే వున్నాయి.
Self Driving Car.. భవిష్యత్తు అంతా డ్రైవర్ లెస్ కార్లదే..
డ్రైవర్ వుంటేనే, బోల్డన్ని ప్రమాదాలు. మరి, డ్రైవరు లేని కార్లకు ఇంకెన్ని ప్రమాదాలుంటాయి.? అందుకే, ఎన్ని సెన్సార్లు వున్నా, ఎంత అత్యాధునిక టెక్నాలజీ వినియోగించినా.. చాలా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అందుకే, డ్రైవర్ లెస్ కార్లు అందుబాటులోకి రావడానికి మరిన్ని ప్రయోగాలు జరగాల్సిందే.

2022లో ఈ డ్రైవర్ లెస్ కార్లపై మరిన్ని ప్రయోగాలు ప్రయోగాలు జరుగుతాయి నిస్సందేహంగా. అయితే, అవి అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది. ప్రస్తుతానికైతే ఇ-కామర్స్ సంస్థలు వీటి పట్ల ప్రత్యేక ఆసక్తి చూపుతున్నాయి. అవి సక్సెస్ అయితే, మనుషుల రవాణా కోసం డ్రైవర్ లెస్ కార్లను భేషుగ్గా వాడేయొచ్చేమో.
రోడ్ సెన్స్ లేకపోతే నాన్సెన్స్ తప్పదు..
డ్రైవర్ లెస్ కార్లలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తారు సరే.. మరి, రోడ్ల విషయంలో ఏం చేయగలం.? చేయాలి, చేసి తీరాల్సిందే. నిజానికి, రోడ్ల నిర్వహణే అతి పెద్ద పెద్ద సమస్య కాబోతోంది డ్రైవర్ లెస్ కార్ల వినియోగంలో. ఖాళీ రోడ్లపైనే కాదు, బిజీ రోడ్లపైనా ఎడా పెడా లేన్లు మార్చేసే ‘ఇడియట్స్’ వల్ల డ్రైవర్ లెస్ కార్లకు అతి పెద్ద ప్రమాదం పొంచి వుంది.
‘రోడ్ సెన్స్’ అనేది వాహనాలు నడిపేవారిలో వస్తే తప్ప, డ్రైవర్ లెస్ కార్లను రోడ్ల మీదకు తీసుకురావడం దాదాపుగా అసాధ్యం. పోనీ, డ్రైవర్ లెస్ కార్లకి ఓ లేన్, డ్రైవర్లతో కూడిన వాహనాలకి ఇంకో లేన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తేనో.! ఏమో, భవిష్యత్తులో అలాంటి రోడ్లే అందుబాటులోకి వస్తాయేమో.
Also Read: జాతిపుష్పం: ఊ అంటావా మావా.. ఊహూ అంటావా.!
ఇంతకీ, డ్రైవర్ లెస్ కార్లు (Self Driving Car) ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే, చలాన్లు ఎవరు కడతారు.? ఛాన్సే లేదు, అసలు అవి నడిచేదే నిబంధనలకు అనుగుణంగా. సో, ట్రాఫిక్ చలాన్లతో సమస్య వుండదుగాక వుండదు.