Table of Contents
Serious Politician Kavitha Suspended.. అరరె.. ఎంత కష్టమొచ్చింది.? అయినా, సీరియస్ పొలిటీషియన్ కవిత మీద గులాబీ పార్టీకి ఎందుకు అంత ఒళ్ళు మంట.?
గులాబీ పార్టీ అధినేత కేసీయార్ స్వయానా కవితకి తండ్రి. అలాంటప్పుడు, కవితని గులాబీ పార్టీ నుంచి తరిమెయ్యడమేంటి.? అసలేం జరిగింది.?
కాళేశ్వరం ప్రాజెక్టు, గులాబీ పార్టీ కొంప ముంచేలా వుంది. కేసీయార్ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం.
అయితే, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అడ్డగోలుగా బొక్కేశారంటూ ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ మేరకు సీబీఐ విచారణకు కూడా ఆదేశించింది రేవంత్ ప్రభుత్వం.
Serious Politician Kavitha Suspended.. హరీష్ రావు మీద కవితకి మంట.. ఎందుకంట.?
కేసీయార్ హయాంలో ఈ ప్రాజెక్టుకి సంబంధించి కీలక వ్యవహారాలు కొన్నాళ్ళు చూసుకున్నారు హరీష్ రావు. ఆ తర్వాత ఆయన్ను ఆ పోర్ట్ ఫోలియో నుంచి స్వయానా కేసీయార్ తప్పించారు.
కానీ, కేసీయార్ కుమార్తె కవిత మాత్రం, హరీష్ రావు మీదనే గుస్సా అవుతున్నారు. హరీష్ రావు మీదా, కేటీయార్ మీదా.. కవిత ఇన్నాళ్ళూ పరోక్షంగా ఆరోపణలు చేస్తూ వచ్చారు.

ఏమయ్యిందోగానీ, సీబీఐ విచారణ అనగానే.. డైరెక్ట్ ఎటాక్ మొదలెట్టారు కవిత. దాంతో, గులాబీ పార్టీ గుస్సా అయ్యింది. వున్నపళంగా కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసి పారేశారు.
ఈ మేరకు గులాబీ పార్టీ (ఇప్పుడు బీఆర్ఎస్‌గా వున్న ఒకప్పటి టీఆర్ఎస్) ఓ అధికారిక ప్రకటన కూడా విడుదల చేయడం గమనార్హం.
జాగృతితో తెలంగాణ ఉద్యమంలో..
తెలంగాణ ఉద్యమంలో ‘జాగృతి’ని స్థాపించి, ‘బతుకమ్మ పండుగ సంబరాల’తో కవిత, ట్రెండ్ సెట్టర్ అయిన మాట వాస్తవం.
ఈ క్రమంలోనే కవిత, లోక్ సభకు ఎన్నికయ్యారు గతంలో. ప్రస్తుతం ఆమె శాసన మండలి సభ్యురాలిగా కొనసాగుతున్నారు.
కాగా, కవిత కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో గులాబీ పార్టీని దెబ్బ తీయాలని చూస్తున్నారంటూ. గులాబీ దళం ఆరోపిస్తోంది.
ఇలా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, అలా కవిత మీద సీరియస్ ఆరోపణలు బీఆర్ఎస్ నేతలు చేయడం షురూ అయిపోయింది.
సీరియస్ పొలిటీషియన్ కవిత..
‘సీరియస్’ అంటే గుర్తొచ్చింది.. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ‘పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు’ అని స్టేట్‌మెంట్ ఇచ్చేసింది కవిత.
‘అన్‌ఫార్చ్యునేట్లీ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు’ అంటూ కవిత ఎగతాళి వ్యాఖ్యలు చేయడమూ చూశాం.
అదేంటో మరి, అన్‌ఫార్చ్యునేట్లీ, సీరియస్ పొలిటీషియన్ కవితని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజునాడే, బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.!
కర్మ ఎవర్నీ వదిలి పెట్టదనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?
అన్నట్టు, కవిత మీద గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఆరోపణలు రావడం, ఆమె కొన్నాళ్ళు జైలు పాలవడం, ఆ తర్వాత బెయిల్ మీద విడుదలవడం తెలిసిన విషయాలే.
ఎంతైనా, అన్‌ఫార్చ్యునేట్లీ కవిత అంటే, సీరియస్ పొలిటీషియన్ కదా.. ఆ మాత్రం స్కాముల ఆరోపణలు ఆమె మీద లేకపోతే ఎలా.?