Shilpa Shetty Sizzling Beauty.. జస్ట్ ఇంకో రెండేళ్ళు.! ‘50’ మైలు రాయిని అందేసుకుంటుందామె వయసు.! పేరు తెలుసు కదా.? శిల్పా శెట్టి.!
చెక్కిన శిల్పంలా మారుతుందని ముందే ఊహించారేమో, అందుకే ‘శిల్ప’ అనే పేరు పెట్టినట్టున్నారు.!
వయసు మీద పడుతున్నా వన్నె తగ్గని అందం.. అని కొందరి విషయంలోనే మాట్లాడుకోగలం. ఆ లిస్టులో శిల్పా శెట్టి పేరు అందరికన్నా ముందే వుంటుందేమో.
లేకపోతే, నలభై ఎనిమిదేళ్ళ వయసులో.. ఇంత అందంగా.. ఇంత ఫిట్‌గా ఎలా.? ఔను, అదంతా శిల్పా శెట్టికే సాధ్యమయ్యింది.
Shilpa Shetty Sizzling Beauty.. వంటికి యోగా మంచిదేగా..
భంచిక్.. భంచిక్ చెయ్యి బాగా.. వంటికి యోగా మంచిదేగా.. అంటూ ఓ తెలుగు సినిమాలో పాటొకటి వుంటుంది. శిల్పా శెట్టి గ్లామర్ సీక్రెట్ కూడా ఆ యోగానే.!
సినిమాల్లో సాధించిన పేరు ప్రఖ్యాతుల కంటే, ‘బిగ్ బ్రదర్’ షో ద్వారా వచ్చిన పాపులారిటీనే ఎక్కువ శిల్పా శెట్టికి.

రాజ్ కుంద్రాతో వివాహంతో శిల్పా శెట్టి రేంజ్ మరింత పెరిగిపోయిందనుకోండి.. అది వేరే సంగతి. చాలా అరుదుగానే సినిమాల్లో కనిపిస్తోందిప్పుడు శిల్పా శెట్టి.
ఆ మధ్య, ఓ చిన్నపాటి ప్రమాదం కారణంగా సర్జరీ చేయించుకుని కొన్నాళ్ళపాటు బెడ్‌కే పరిమితమైపోయిన శిల్పా శెట్టి, తిరిగి యాక్టివ్ అయిపోయింది.
మంచుకొస్తున్న వయసుని ఓడించేస్తోంది..
ఇదిగో, తాజాగా ఇలా దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇచ్చింది శిల్పా శెట్టి.! ఔను, శిల్పా శెట్టి.. వయసుని ఓడించేస్తోంది.!
అన్నట్టు, శిల్పా శెట్టి ఆ మధ్య యోగా వీడియోలు కూడా చేసింది. అలా యోగాసనాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా మారిపోయింది.

ఫిట్నెస్ సీక్రెట్ ఏంటని అడిగితే, డాన్స్.. స్విమ్మింగ్.. యోగా.. అని చెబుతుంటుంది ఈ బక్క పలచ భామ.! ఇన్నేళ్ళలో ఎప్పుడూ, కాసింత కండ అదనంగా పెరిగింది లేదు శిల్పా శెట్టిలో.!
Also Read: సినిమానా.? రాజకీయమా.? సమంత దారెటు.?
తెలుగులో ‘సాహస వీరుడు సాగర కన్య’ తదితర సినిమాల్లో శిల్పా శెట్టి (Shilpa Shetty) నటించిన సంగతి తెలిసిందే.
