Shraddha Rama Srinath.. శ్రద్ధా శ్రీనాథ్ గుర్తుంది కదా.? అదేనండీ, నాని హీరోగా రూపొందిన ‘జెర్సీ’ సినిమాలో నటించింది కదా.? ఆ కన్నడ కస్తూరి గురించే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నది.!
పేరులో ఏముంది.? ఔను, పేరులో ఏముంటుంది.. ఏమీ లేకపోతే, ఆ పేరుకి రకరకాల మార్పులు చేర్పులు ఎందుకు చేస్తుంటారు.?
పేరు మార్చితే, కాలం కలిసొస్తుందని భావించే సినీ జనాలు చాలామందే కనిపిస్తారు. లక్ష్మీ రాయ్ (Laxmi Rai) కాస్తా, రాయ్ లక్ష్మీ (Raai Laxmi) అయ్యింది. చెప్పుకుంటూ పోతే, ఈ లిస్టు చాలా చాలా పెద్దదే.
పేరు మార్చేసుకున్న శ్రద్ధ.!
ఔను, శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) తన పేరుని మార్చుకుంది. శ్రద్ధా రమా శ్రీనాథ్ అట ఆమె కొత్త పేరు.! ఇందులో ‘రమా’ అంటే, అది ఆమె తల్లి పేరు అట.

ఇంతకీ, పేరు ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందబ్బా.? అంటే, దానికీ చాలా పెద్ద కథే వుందట. నిజానికి, అది పెద్ద కథ కాదు, చాలా చాలా చిన్న విషయం.
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్, బెంగాలీ బ్యూటీ శ్రద్ధా దాస్.. ఇలాంటి పేర్లతో తన గురించి ప్రస్తావిస్తున్నారంటూ వాపోయింది శ్రద్ధా శ్రీనాథ్. అదీ అసలు సంగతి.
Shraddha Rama Srinath.. ఎక్కడో ఎవరో ట్వీటేశారని..
శ్రద్ధా దాస్ పేరుతో, శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) ఫొటోని ఎవరో పోస్ట్ చేస్తే, అదిగో.. దాదాపు 10 లక్షల మంది ఫాలోవర్స్ వున్న ఫిల్మీ మీడియా సోషల్ హ్యాండిల్‌లో తప్పు జరిగింది.. అంటూ గుస్సా అయ్యింది శ్రద్ధా శ్రీనాథ్.
Also Read: వదల బొమ్మాళీ.! కానీ, ఎన్నాళ్ళిలా తనూశ్రీ.?
అక్కడెవరో చిన్న పొరపాటు చేశారని, శ్రద్ధా శ్రీనాథ్ అనే తన పేరుని, శ్రద్ధా రమా శ్రీనాథ్.. అని మార్చుకుందంటే.. ఆమె ‘ఆటిట్యూడ్’ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
అన్నట్టు, కొన్నాళ్ళపాటు శ్రద్ధా శ్రీనాథ్ అలియాస్ శ్రద్ధా రమా శ్రీనాథ్ సోషల్ మీడియాకి దూరంగా వుండబోతోందట.