ఈ మధ్యనే ‘క్రాక్’ సినిమాతో హిట్టు కొట్టింది అందాల భామ శృతిహాసన్. తన తదుపరి రిలీజ్ ‘వకీల్ సాబ్’ గురించి చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నానంటోంది ఈ బ్యూటీ. కెరీర్‌లో ఈ కొత్త ఫేజ్ చాలా బావుందనీ, వరుస అవకాశాలతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాననీ, తనపై బాధ్యత మరింత పెరిగినట్లుగా భావిస్తున్నాననీ ఓ ప్రశ్నకు బదులిచ్చింది శృతిహాసన్ (Shruti Haasan About Love And Cinema).
అయితే, ‘మీ కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరు.? పెళ్ళెప్పుడు?.’ అంటూ ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ప్రశ్నలు ఎదురయినప్పుడు, ఒకింత అసహనం వ్యక్తం చేసింది.
‘ఇప్పడిప్పుడే మంచి మంచి అవకాశాలొస్తున్నాయి.. కొత్త ఇన్నింగ్స్ అందంగా వుండాలని కోరుకుంటున్నాను. దయచేసి పర్సనల్ లైఫ్ గురి అడిగి ఇబ్బంది పెట్టొద్దు..’ అంటూ శృతిహాసన్ (Shruti Haasan) సున్నితంగానే తిరస్కరించింది.
గతంలో శృతిహాసన్ మైఖేల్ కోర్సలేతో ప్రేమలో పడటం, తన తండ్రి కమల్ హాసన్‌కి కూడా తనకు కాబోయేవాడ్ని పరిచయడం చేయడం తెలిసిన సంగతులే. కమల్ కూడా, తనకు కాబోయే అల్లుడు తన కుటుంబాన్ని బాగా అర్థం చేసుకున్నాడంటూ మురిసిపోయాడు.
కమల్ హాసన్ బంధువులకు సంబంధించిన ఓ వేడుకలో, మైఖేల్ కోర్సలే హల్‌చల్ చేశాడు కూడా. కానీ, ఏమయ్యిందో మైఖేల్ కోర్సలేతో శృతిహాసన్ బంధం తెగిపోయింది. ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించేశారు.
నిజానికి మైఖేల్ కోర్సలేతో ఎఫైర్ కారణంగానే శృతిహాసన్ చాలా మంచి ప్రాజెక్టులు కూడా వదిలేసుకుంది. కానీ, లైఫ్‌లో అనుకోని సంఘటనలు జరుగుతూనే వుంటాయి.. శృతి ఇందుకు మినహాయింపు కాదు.
తాజాగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో శృతి ప్రేమలో (Shruti Haasan About Love And Cinema) పడిందనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశాన్ని ప్రస్తావిస్తే, పై విధంగా నొచ్చుకుంది శృతి. తన ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించిన అంశాలపై ఫోకస్ పెట్టాలనీ, పర్సనల్ లైఫ్ గురించి అడగొద్దనీ తేల్చి చెప్పేసిందీ అందాల భామ.
ప్రభాస్‌తో (Prabhas) ‘సలార్’లో (Salaar) నటించడం చాలా చాలా ఆనందంగా వుందంటోన్న శృతిహాసన్, ఈ సినిమా కథ, ఇందులోని తన పాత్ర గురించి ఎలాంటి విషయాలూ బయటకు చెప్పలేనంటూ లైట్ తీసుకుంది.