Home » నాలుగు పదుల వయసులో.. కుర్చీ మడతబెడితేనే ఫిట్టు.. పెర్‌ఫెక్టు.!

నాలుగు పదుల వయసులో.. కుర్చీ మడతబెడితేనే ఫిట్టు.. పెర్‌ఫెక్టు.!

by hellomudra
0 comments
Shweta Konnur Menon

Shweta Konnur Menon Fitness.. నాలుగు పదుల వయసులో శరీరం కొత్త సవాళ్ళను విసురుతుంటుంది.. మహిళలకైనా, మగవాళ్ళకైనా.!

నలభై ఐదు దాటిందంటే, ఇంకాస్త జాగ్రత్తగా వుండక తప్పదు. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా, ఐదు పదుల వయసులోనూ ఫిట్‌గా వుండటానికి మార్గం సుగమం అవుతుంది.

మగవాళ్ళతో పోల్చితే, మహిళలకు ఇది మరింత ప్రత్యేకమైన వయసు. ఎందుకంటే, మగవాళ శరీర నిర్మాణానికీ, మహిళల శరీర నిర్మాణానికీ చాలా తేడాలుంటాయ్ మరి.

Shweta Konnur Menon Fitness.. వయస్సునామీ..

శరీరకంగా, మానసికంగా.. నాలుగు పదుల వయసులో ధృఢంగా వుండగలిగితే, యాభయ్యేళ్ళు దాటాక సాధారణంగా వచ్చే అనేకానేక అనారోగ్య సమస్యల్ని కాస్త వాయిదా వేయొచ్చు.

ఇంతకీ, కఠినతరైన వర్కవుట్స్ నాలుగు పదుల వయసులో చేయొచ్చా.? ఫొటోలో చూస్తున్నట్లుగా బొద్దుగా వున్న శరీరాన్ని అంతలా కష్టపెట్టడం సబబేనా.?

Shweta Konnur Menon
Shweta Konnur Menon

ఖచ్చింగా, వైద్యుల సూచనలు సలహాలు తీసుకుని, తదనుగుణంగా శరీరాన్ని కష్టపడితే, కష్టపడి వంచితే.. వయసు మీద పడ్డం వల్ల వచ్చే చాలా ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.

ఇక్కడ, వైద్యుల సూచనలు, సలహాలు తప్పనిసరి. అలాగే, ఫిట్‌నెస్ ట్రైనర్ కూడా అనుభవజ్ఞులై వుండాలి. సొంత పైత్యాలు అస్సలు వాడకూడదు.

జర జాగ్రత్త మరి..

యూ ట్యూబ్ ఛానళ్ళు చూడటం ద్వారా, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సహా వివిధ సామాజిక మాధ్యమాల్లో కనిపించే రీల్స్ చూడటం ద్వారా.. శరీరాన్ని ఎడా పెడా వంచేస్తే, తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు.

రోజుల తరబడి, నెలల తరబడి ఓ క్రమ పద్ధతిలో వ్యాయామం చేస్తేనే, శరీరాన్ని ఎలా కావాలంటే అలా వంచుకునేందుకు కాస్త వీలవుతుందన్న విషయాన్ని గుర్తెరగాలి.

Shweta Konnur Menon
Shweta Konnur Menon

ఇంతకీ, ఇక్కడ ఫొటోల్లో కనిపిస్తున్నదెవరో తెలుసా.? ఆమె ఓ సినీ సెలబ్రిటీ. పేరు శ్వేత కొన్నూర్ మీనన్. పేరు ఎక్కడో విన్నట్లుంది కదా.!

ఫేస్ కూడా, కాస్త ఫెమిలియర్ అనే అనిపిస్తోంది కదా.? మాళవిక అంటే, గుర్తు పడతారేమో. తమిళ, మలయాళ, కన్నడ సహా తెలుగు సినిమాల్లోనూ నటించింది మాళవిక అలియాస్ శ్వేత కొన్నూర్ మీనన్.

తెలుగు సినిమాల్లోనూ శ్వేత నటించింది..

ప్రస్తుతం సినిమాల్లో నటించడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే వుంది. భర్త, ఇద్దరు పిల్లలతో ఎప్పటికప్పుడు, సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తుంటుంది శ్వేత.

Also Read: లెహెంగా ఖరీదు లచ్చ.! చీప్ అండ్ బెస్టేగా.!?

బొద్దుగా వున్నా, తాను ఫిట్ అండ్ పెర్‌ఫెక్ట్ అని చెప్పే శ్వేతకి, నటన మీద పెద్దగా ఆసక్తి లేదట. అన్నట్లు, మాళవిక అలియాస్ శ్వేత, ఓ తెలుగు నటుడితో వివాదం కారణంగా అప్పట్లో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది.

ఆ వివాదం తర్వాతనే, మాళవిక అలియాస్ శ్వేత కొన్నూర్ మీనన్ తెలుగు సినిమాల్లో కొనసాగలేదు.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group