Home » రోజా రాజకీయమ్.! బూతులు.. తిట్టడమ్, తిట్టించుకోవడమ్.!

రోజా రాజకీయమ్.! బూతులు.. తిట్టడమ్, తిట్టించుకోవడమ్.!

by hellomudra
0 comments
Roja Selvamani

Roja Dirtiest Politics YSRCP.. వరుసగా రెండు సార్లు నగిరి ఎమ్మెల్యేగా రోజా, రాజకీయాల్లో వుండి ఏం సాధించారు.? ప్చ్, నియోజకవర్గంలో ఎవరడిగినా, ఏమీ లేదు.. అనే చెప్తారు.

పోనీ, మంత్రిగా రోజా ఏం అభివృద్ధి చేశారు.? ప్చ్, అస్సలేం లేదు.

కానీ, ఎమ్మెల్యే హోదాలో.. అలానే మంత్రి హోదాలో.. తిరుమలకు ఎన్నిసార్లు సన్నిహితులు, బంధువుల్ని తీసుకెళ్ళి వుంటారు.? బోల్డన్ని సార్లు.!

రాజకీయాల్లో రోజా తిట్టిన, తిట్టించుకున్న బూతులు ఎన్ని.? అంటే, లెక్కలేనన్ని.! ‘డిక్కీ బలిసిన కోడి’, ‘గాడిద’, అడ్డంగా బలిసిపోయిన దున్నపోతు..’ ఇలాంటివే కాదు, బూతులు మరింత హేయం.

కేవలం రోజా మాత్రమే రాజకీయాల్లో బూతులు వాడుతున్నారా.? అంటే, చాలామంది వాడుతున్నారుగానీ, పోలీసులు అధికారులపైనా ‘లం’ భాష వాడిన ఘనత రోజాకే దక్కుతుంది.

Roja Dirtiest Politics YSRCP.. నువ్వు తిడితే.. నిన్నూ తిడతారు కదా.?

మరి, రోజాకి అర్థమయ్యే భాషలోనే రాజకీయ ప్రత్యర్థులు కూడా సమాధానమిస్తారు కదా.? అంటే, అలాంటప్పుడు, రోజాకి తాను మహిళనన్న విషయం గుర్తుకొస్తుంటుంది.

‘మహిళనని కూడా చూడకుండా నన్ను తిడుతున్నారు..’ అంటూ, మీడియా ముందుకొచ్చి ఏడవడం రోజాకే చెల్లింది మరి.!

వరుసగా రెండు సార్లు నగిరి ఎమ్మెల్యేగా రోజా గెలిచిన మాట వాస్తవం. మంత్రి అయ్యారు కూడా. పవన్ కళ్యాణ్‌ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం.. అని సవాల్ విసిరారు రోజా గతంలో.

కట్ చేస్తే, రోజా పరిస్థితి ఏంటిప్పుడు.? అసెంబ్లీ గేటు బయటే వుండాలి తప్ప.. లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు.! ఇవే, రాజకీయాల్లో రోజా తగ్గించుకుంటే మంచిది.

గాడిద.. అడ్డగాడిద..

తాజాగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీదా, సీఎం చంద్రబాబు మీదా, ‘గాడిదలు’ అంటూ విరుచుకుపడ్డారు రోజా. రోజాకి, రోజా భాషలోనే సమాధానం చెప్పారు జన సేన నేత సుభాషిణి.

అంతే, వైసీపీ శ్రేణులు మూకుమ్మడిగా జన సేన మీద విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణే అలా ఆమెని తిట్టించారట. మరి, పవన్ కళ్యాణ్‌ని రోజా తిట్టినప్పుడో.? రోజాతో జగన్ తిట్టించారని అనాలి కదా.?

Also Read: ఔను.! వాళ్ళిద్దరూ విడిపోయారు.!

మహిళలైనా, మగవాళ్ళైనా.. రాజకీయాల్లో వున్నప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. రాజకీయమంటే శతృత్వం కాదు, రాజకీయమంటే ప్రజా సేవ.

ఈ విషయం రోజాకి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group