Siddu Jonnalagadda Womanizer.. మౌనం.. అర్థాంగీకారం.. అంటారు పెద్దలు.! ఇప్పుడు దీన్ని, సిద్దు జొన్నలగడ్డ విషయంలో అన్వయించవచ్చా.? అసలేం జరిగింది.?
సిద్దు జొన్నలగడ్డ హీరోగా రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా ‘తెలుసు కదా’ అనే పేరుతో ఓ సినిమా తెరకెక్కింది. సినిమా విడుదలకు సిద్ధమైంది.
సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో భాగంగా, మీడియా కొన్ని ప్రశ్నలు సంధించింది చిత్ర యూనిట్‌కి.!
కాంట్రవర్సీ కోసం సినిమా టీమ్, దిక్కుమాలిన ప్రశ్నల్ని మీడియా ప్రతినిథులతో వేయిస్తుందా.? మీడియా ప్రతినిథులే దిగజారుడుతనంతో దిక్కుమాలిన ప్రశ్నలు వేస్తారా.?
Siddu Jonnalagadda Womanizer.. దిక్కుమాలిన పాత్రికేయం..
కారణమేదైతేనేం, ఓ దిక్కుమాలిన ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అది కూడా, ఓ మహిళా జర్నలిస్టు నుంచి దూసుకొచ్చింది నేరుగా సిద్దు జొన్నలగడ్డ వైపుకి.
‘మీరు ఉమనైజరా.?’ అంటూ, సిద్దూని ప్రశ్నించింది ఆ సినీ ఎర్నలిస్టు. అసలు, జర్నలిజం పేరుతో వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారు.? అన్నది అంతుబట్టడంలేదు.
బ్రోతల్ హౌస్‌కి వెళ్ళి అక్కడ మాట్లాడాల్సిన మాటలివి. సినీ ప్రముఖుల్ని, ‘ఉమనైజర్’ అని అడగడమేంటి సిగ్గు లేకపోతే.?
Also Read: న్యూస్ పేపర్‌తో గ్లామర్.! కాగితమే అందం.!
‘ఉమనైజర్’ అనే ప్రశ్న వేసేంత స్థాయికి సదరు మహిళా జర్నలిస్టు దిగజారిందంటే, ఆమెను ఎవరైనా గోకి వుండాలి ఆల్రెడీ.! అదే నిజమా.? అన్న ప్రశ్న తెరపైకొస్తోందిప్పుడు.
ఉమనైజర్ అంటే, స్త్రీ లోలుడు.. అని సాఫ్ట్‌గా చెప్పొచ్చు. కానీ, ఇదీ అభ్యంతకరమైన పదమే. ‘ముం..ల’ పిచ్చోడు’ అన్నది కరెక్ట్ పదం.!
ఇంత దారుణమైన ప్రశ్న తనవైపుకు దూసుకొస్తే, హీరో సిద్దు జొన్నలగడ్డ, తగిన సమాధానం చెప్పకుండా ఎందుకు మౌనం దాల్చినట్లు.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్.
అందుకే, మౌనం అర్థాంగీకారమా.? అని ప్రశ్నించింది.! తనను ఓ జర్నలిస్టు అభ్యంతకరమైన ప్రశ్న అడిగితే, సినీ నటి మంచు లక్ష్మి న్యాయపోరాటం చేసింది.
దెబ్బకి దిగొచ్చిన జర్నలిస్ట్ మూర్తి, బహిరంగ క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేశాడు.
మంచు లక్ష్మికి వున్నపాటి తెగువ, దైర్యం.. సిద్దు జొన్నలగడ్డలో లేకుండా పోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
