Table of Contents
Sini Shetty Miss World.. మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అందాల భామ సిని శెట్టి.
అప్పట్లో మిస్ వరల్డ్ అందాల పోటీల్లో విజేతగా నిలిచిన ఐశ్వర్యా రాయ్ బచ్చన్ బెంగుళూర్ బ్యూటీనే.!
అలాగే ఇప్పుడు సిని శెట్టి కూడా బెంగుళూర్ బ్యూటీనే కావడం విశేషం. సిని శెట్టి మూలాలు అంటే తల్లితండ్రులు కర్ణాటకకు చెందిన వారు అయినా.. సిని శెట్టి పుట్టి, పెరిగింది మాత్రం ముంబయ్‌లోనే.
ఆమెకు నాలుగేళ్ల వయసున్నప్పటి నుంచే డాన్స్ అంటే ప్రాణం అని చెబుతోంది. 14 ఏళ్ల వయసు నుంచే స్టేజ్ షోలివ్వడం స్టార్ట్ చేసింది.
Sini Shetty Miss World.. భరత నాట్యం నుంచి అందాల పోటీ దిశగా..!
డ్యాన్స్ (భరత నాట్యం) పట్ల వున్న ఇంట్రెస్ట్ కాస్తా అందాల పోటీ వైపు మళ్లిందని చెబుతోంది సిని శెట్టి. తన ప్యాషన్‌ని ఇంట్లోని వాళ్లంతా అభిమానించి ఆదరించారు.
అందుకే తాను ఇంత దూరం రాగలిగానని చెబుతోంది సిని శెట్టి. ఫిబ్రవరి 18 నుంచి స్టార్ట్ అయిన మిస్ వరల్డ్ అందాల పోటీలు మార్చి 9 వరకూ జరగనున్నాయ్.

ముంబయ్‌లో ఫైనల్స్ జరగనున్నాయ్. ఈ క్రమంలో ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో సిని శెట్టి ఎంత మేర ఒత్తిడికి ఫీలవుతుందో కదా.!
కానీ, అలాంటి ఒత్తిడేమీ తనకు లేదనీ, చాలా కాన్ఫిడెంట్‌గా ఈ పోటీల్లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చాననీ.. చివరి వరకూ అదే కాన్ఫిడెన్స్‌తో వుంటాననీ చెబుతోంది కాబోయే మిస్ వరల్డ్ అందాల సిని శెట్టి.
కాబోయే మిస్ వరల్డ్.!
2022లో మిస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచిన సిని శెట్టి.. ఇప్పుడు మిస్ వరల్డ్ కిరీటాన్నీ దక్కించుకుని, ప్రపంచ వ్యాప్తంగా అందాల పోటీల్లో మన ఇండియా గొప్పతనం చాటి చెప్పాలని ఎదురు చూస్తున్నారంతా.

‘భావోద్వేగాల విషయంలో నేనొక రోలర్ కోస్టర్‌ని..’ అని తనను తాను అభివర్ణించుకుంది సిని శెట్టి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అందగత్తెలు ఈ పోటీకి విచ్చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తన కాన్ఫిడెన్స్‌ని తాను వదులుకోలేననీ, వాళ్లందరి ముందూ తను తన గొప్పతనాన్ని చూపించాల్సిన ఆవశ్యకత వుందనీ చెబుతోంది సిని శెట్టి.
ఒత్తిడి సహజమే, కానీ.!
ఇలాంటి సమయంలో ఒత్తిడి చాలా సహజం. కానీ, మనం చేసే పనిపై ప్యాషన్, మనల్ని మనం గొప్పగా ఆవిష్కరించుకునేందుకు తోడ్పడుతుంది.
అదే ఒత్తిడి నుంచి రిలీఫ్ ఇస్తుంది. ఈ అందాల పోటీల్లో విజేతగా గెలవాలని రెండేళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటోంది సిని శెట్టి.

ఈ క్రమంలో తాను వేసే ప్రతీ అడుగులోనూ ఎన్నో ఆటంకాలు చవి చూడాల్సి వచ్చిందనీ, ఆ కష్టమే తనను సక్సెస్‌ఫుల్‌గా ఇంత దూరం తీసుకొచ్చిందని చెబుతోంది సిని శెట్టి.
మనం దేన్నయితే నమ్ముకుంటామో.. దానిపై బలమైన నమ్మకం పెడితే, అదే మనల్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుంది అని సిని శెట్టి ఇన్స్పైరింగ్ వ్యాఖ్యలు చేసింది.