Home » Six Pack.. హ్యాండ్సమ్ హంక్స్ & హాట్ బ్యూటీస్.!

Six Pack.. హ్యాండ్సమ్ హంక్స్ & హాట్ బ్యూటీస్.!

by hellomudra
0 comments
Fit And Perfect Six Pack

ఇప్పుడు సిక్స్‌ ప్యాక్‌ బాడీ (Six Pack Fitness) అంటే ఎంత ట్రెండింగో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ట్రెండ్‌ని అచ్చంగా ఫాలో అయిపోయే కుర్రకారు ఈ సిక్స్‌బాడీ వైపు అలాగే మొగ్గు చూపుతున్నారు.

ఏదో హీరోలు వెండితెరపై మెరిసిపోయేందుకు సిక్స్‌ ప్యాక్‌ చేశారులే. అది మన ఒంటికి పడదులే అనుకుంటే పొరపాటే. మనమూ ఆ హీరోల్లానే ఎందుకు పలకల బాడీని చూపించకూడదు అనుకుంటున్నారు.

అనుకోవడమే కాదు, అమాంతం ఫిట్‌నెస్‌ సెంటర్స్‌పై పడిపోతున్నారు అందాల భామలు. తమ శరీరాన్ని అందంగా ఆరు పలకల ఆకృతిలోకి మార్చేసుకుంటున్నారు ఈ మెరుపు తీగలు. ఇదంతా బాగానే ఉంది.

Also Read: Pegasus స్పైవేర్.. దోచుకున్నోడికి దోచుకున్నంత

అయితే ఈ సిక్స్‌ (Six Pack Fitness) ప్యాక్‌ బాడీ అబ్బాయిలకేనా? అలా అనుకుంటే ఈ సారి మీరు తప్పులో కాలేసినట్లే. కేవలం అబ్బాయిలకే కాదండీ బాబూ. సిక్స్‌ ప్యాక్‌ అమ్మాయిలు కూడా ఉన్నారు.

అంతెందుకు ముద్దుగుమ్మలు కూడా పురుష పుంగవులకు తామేం తక్కువ కాదంటూ ఈ సిక్స్‌ ప్యాక్‌ బాడీతో ఫ్యాన్స్‌కి ఎలాంటి కిర్రాకు పుట్టిస్తున్నారో ఈ మధ్య సోషల్‌ మీడియాలో చూస్తున్నారుగా.

అమ్మాయిలకూ సిక్స్‌ ప్యాక్‌ ఫీవర్‌ (Six Pack Fitness)

ట్రెండ్‌ అంటే ఓన్లీ అబ్బాయిలకే, ఓన్లీ అమ్మాయిలకే అనేం లేదు కదా. టోటల్‌ యూత్‌ ఆ మాటకొస్తే, ఆంటీస్‌, అంకుల్స్‌ కూడా ట్రెండ్‌ని ఫాలో అయిపోతున్నారు. అదీ సిక్స్ ప్యాక్ ఫిజిక్ కి వున్న క్రేజ్.

సరే ఆంటీస్‌, అంకుల్స్‌ గురించి అయితే మనం తర్వాత చర్చించుకుందాం కానీ, ప్రస్తుతానికి ఈ సిక్స్‌ ఫ్యాక్‌ ఫీవర్‌ని (Six Pack Fitness) ఒంట పట్టించుకుంటున్న అమ్మాయిల గురించి కాస్త అటూ ఇటూగా చర్చించుకుందాం.

ముద్దుగుమ్మల్లో సిక్స్‌ప్యాక్‌ ఫోబియా..

ఈ సిక్స్‌ప్యాక్‌ ఫీవర్‌ని ఒంటపట్టించుకున్న ముద్దుగుమ్మల్లో ముఖ్యంగా ‘గురు’ ఫేం రితికా సింగ్‌ (Ritika Singh) గురించి చెప్పుకోవాలి. చూడ్డానికి క్యూట్ గా వుండే ఈ భామని టచ్ చేశారో, బాక్సింగ్ పంచ్ ఇచ్చేస్తుంది జాగ్రత్త.

ఈ బ్యూటీ తన అందమైన శరీరాన్ని సిక్స్‌ ప్యాక్‌గా మలిచేసి, ఎంచక్కా ఫోటోలకు పోజిచ్చేసి ఎలా ఉందంటూ అభిమానుల్ని ఒపీనియన్‌ అడిగేసింది. సో సెక్సీ అంటూ ఫ్యాన్స్‌ ఆమె సిక్స్‌ ప్యాక్‌ని చూసి పొగడ్తల వర్షం కురిపించేశారు.

Also Read: అనసోయగం.! ఎలా.. ఇంతందంగా ఎలా.?

రితికానే కాదు. ఇలా సిక్స్‌ప్యాక్‌ని ఫాలో అయిన ముద్దుగుమ్మల్లో ఇంకా చాలా మందే ఉన్నారు. ‘జైసింహా’ సినిమాలో బాలయ్య పక్కన హాట్‌ హాట్‌గా స్టెప్పులు ఇరగదీసిన బ్యూటీ నటాషా దోషీ (Natasha Doshi) గుర్తుంది కదా. ఆ ముద్దుగుమ్మకి కూడా ఈ తరహా బాడీని ట్రై చేసి, ఎక్స్‌పోజింగ్‌కి పెట్టింది.

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), దిశా పటానీ (Disha Patani), అమైరా దస్తుర్ (Amyra Dastur), ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal).. ఇలా ఒకరేమిటి, నాజూకు శరీరాన్ని ముప్పు తిప్పలు పెట్టేసి.. మెరుపు తీగల్లా మారిపోతున్న అందాల భామలెందరో వున్నారు.

సిక్స్‌ ప్యాక్‌ (Six Pack Fitness) గురించి అనుమానాలొద్దు.!

సిక్స్‌ ప్యాక్‌ ట్రై చేస్తే ఫేస్‌లో మార్పులు వచ్చేస్తాయి. హ్యాండసమ్‌ లుక్‌ పోతుంది అనే భయం కొందరిలో ఉంటుంది. ఆ ఆలోచనతోనే ఎంతో మంది కుర్రహీరోలు సిక్స్‌ ప్యాక్‌ని సింపుల్‌గా ట్రై చేసేసినా సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు సిక్స్‌ ప్యాక్‌ జోలికి పోలేదు.

అయితే సిక్స్‌ ప్యాక్‌ ఫిజిక్‌ ఉన్నా గ్లామర్‌లో ఎలాంటి తేడాలు రావని అందాల భామలే నిరూపిస్తున్నారు. అందాల భామల లెక్కలు వేరేలా వుంటాయ్ కదా. అయినా, ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది.. రఫ్ లుక్ కూడా ఫ్యాషన్ అయ్యింది మరి.

Also Read: ఒక ప్రమాదం.. పతనమైంది ‘పెద్దరికం’.!

ప్రపంచవ్యాప్తంగా హాట్‌ బ్యూటీస్‌ చాలా మంది సిక్స్‌ ప్యాక్‌ ఫిజిక్‌పై ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. ఇండియాలో కూడా ఈ తరహా ఫిజిక్‌పై అవగాహన ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఏదైనా సాధించగలం అన్న తపనే అందాల భామలతోనూ సిక్స్‌ ప్యాక్‌ చేయించేలా చేస్తోంది.

Jacqueline Fernandez Spicy Fitness Secret
Jacqueline Fernandez Spicy Fitness Secret

హీరోలకు తక్కువ కాదు.. ఈ హీరోయిన్లు..

ఇదివరకు సినిమాల్లో హీరోలతో పోటీపడి ఫైట్స్‌ చేయడానికి హీరోయిన్లు చాలా కష్టపడే వాళ్లు. కానీ ఇప్పుడలా కాదు. హీరోలకు తామేం తక్కువ కాదంటూ రంగంలోకి దూకుతున్నారు. ఆకాశంలో సగం, అన్నింటా సగమనే భావనతో దూకుడు ప్రదర్శిస్తున్నారు అన్ని విషయాల్లోనూ.

Also Read: 75 ఏళ్ళ స్వాతంత్ర్యం.. జరుగుతోందా న్యాయం.?

సినిమాని కెరీర్‌గా ఎంచుకున్నప్పుడే పలు రకాలైన యాక్షన్‌ స్టంట్స్‌ నేర్చుకుంటున్నారు. కొందరు ముద్దుగుమ్మలు కండలు తిరిగిన దేహాన్ని ప్రదర్శిస్తుంటే, ఇంకొందరు నాజూకు శరీరంతోనే ఆ ఫీట్స్‌ వేస్తున్నారు. బికినీల్లో అందాల ఆరబోతకి ఇది మరింత ఉపకరిస్తుందనేది కొందరి భావన.

‘మేరీకోమ్‌’ సినిమా కోసం సిక్స్‌ ప్యాక్‌ కాకపోయినా, ఆ స్థాయిలో ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) కసరత్తులు చేసింది. అలాగే తాప్సీ (Tapsee Pannu) కూడా ‘నామ్‌ షబానా’ తదితర యాక్షన్‌ ఫిలిమ్స్‌ కోసం తన నాజూకు దేహాన్ని కొంచెం ఎక్కువే కష్టపెట్టేసింది.

సిక్స్‌ ప్యాక్‌ కోసం అలా చేయొద్దు ప్లీజ్‌.!

సినిమాల కోసం, కెరీర్‌ కోసం తమకు తప్పదనుకుంటున్న హీరోయిన్లు మాత్రమే కాదు, సహజంగానే అమ్మాయిలు ఇప్పుడు సిక్స్‌ ప్యాక్‌ బాడీని ట్రై చేసేందుకు ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు.

Also Read: అందం వెనుక ఆవేదన: అనుపమకి ఏమైంది.?

జిమ్‌లకు వెళుతున్న అమ్మాయిలు తమ ట్రైనర్స్‌ని సిక్స్‌ ప్యాక్‌ కాకపోయినా యాబ్స్‌ రెండు నుండి నాలుగు వచ్చేవరకూ చేయగలమా? అని అడుగుతున్నారట. కానీ, అది ప్రమాదకరం. సరిగ్గా తినాలి, తగినంత వ్యాయామం చేయాలి. అన్నిటికన్నా ఆరోగ్యమే ముఖ్యం కదా.

గట్టిగా వ్యాయామం చేసినా, కసి తీరా కసరత్తులు చేసినా.. ఇవన్నీ ఫిట్‌నెస్‌ కోసమే కదా.. ఫిట్‌నెస్‌ ఆరోగ్యానికి సంబంధించింది. ఆరోగ్యకరంగా దాన్ని సాధిస్తే మంచిదే. మార్కెట్లో దొరికే కొన్ని ఫేక్‌ ప్రొడక్ట్స్‌ని వాడడం, స్టెరాయిడ్స్‌ మందుల ద్వారా సిక్స్‌ ప్యాక్‌ పొందాలనుకోవడం ప్రమాదరకరం.

ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, అనుభవజ్ఞులైన ఫిట్‌నెస్‌ ట్రైనర్స్‌ సమక్షంలోనే ఈ తరహా ఫీట్స్‌ చేయడం శ్రేయస్కరం. సో సిక్స్‌ ప్యాక్‌ (Six Pack Fitness) అమ్మాయిలూ తస్మాత్‌ జాగ్రత్త.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group