Smriti Mandhana Wedding Cancelled.. ఇప్పుడెంత హ్యాపీగా వుందో కదా.! ఔను, గోతి కాడ నక్కల్లా ఎదురు చూస్తోన్న కొందరికి, శుభ వార్త.! పండగ చేస్కోండిక.!
ఔను, క్రికెటర్ స్మృతి మందాన పెళ్ళి రద్దయ్యిందంటే పండగే కదా.! అంతే మరి, శుభ కార్యం ఎక్కడా జరగకూడదు.. అది చెడిపోతేనే, కొందరికి ఆనందం.
సోషల్ మీడియా, వెబ్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా.. అన్నిటిదీ దాదాపు అదే తీరు.!
స్మృతి మందాన – పలాష్ ముచ్చల్ కొద్ది రోజుల క్రితం, తాము పెళ్ళి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది మొదలు, ఇద్దరూ ఎప్పుడు విడిపోతారా.? అని చాలామంది ఎదురు చూశారు.
వారందరి కోరికా నెరవేరింది. అధికారికంగా తన పెళ్ళి రద్దు విషయాన్ని స్మృతి మందాన సోషల్ మీడియా వేదికగా వెళ్ళడించేసింది.
స్మృతి మందాన – పలాష్ మచ్చల్.. ప్రేమించుకున్నారు. పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇంతలోనే, స్మృతి మందాన తండ్రి గుండె పోటుతో ఆసుపత్రిలో చేరారు.
మరోపక్క, పలాష్ ముచ్చల్ కూడా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో, పుకార్లు విచ్చలవిడిగా షికారు చేయడం మొదలైంది.
అసలు, స్మృతి మందానకి గుండె పోటు వచ్చిందే, పెళ్ళి ఇష్టం లేక.. అన్న ప్రచారం తెరపైకి వచ్చింది. ‘కాదు మొర్రో..’ అని ఇరు కుటుంబాలూ ఎంత మొత్తుకున్నా ఉపయోగం లేకుండా పోయింది.
పలాష్ ముచ్చల్‌కి అక్రమ సంబంధాలున్నాయంటూ మీడియాలో కథనాలు గుప్పుమన్నాయి. ఇదంతా తమ కుటుంబ ప్రతిష్టని దెబ్బ తీయడానికి జరుగుతున్న కుట్ర.. అని పలాష్ కుటుంబం గుస్సా అయ్యింది.
ఇంత గందరగోళం నడుమ పెళ్ళి అవసరమా.? అని ఇటు స్మృతి మందాన అటు పలాష్ ముచ్చల్ ఓ నిర్ణయానికి వచ్చి వుండొచ్చు.
కారణం అదేనా.? ఇప్పుడిక ఈ విషయమై, మీడియా ఎటూ సరికొత్తగా గాలి వార్తల్ని పోగేస్తుందనుకోండి.. అది వేరే సంగతి.
క్రికెట్ మీద మరింత దృష్టి పెడతాననీ, దేశం తరఫున మరిన్ని గొప్ప టోర్నీలు ఆడతాననీ.. తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించవద్దనీ స్మృతి మందాన విజ్ఞప్తి చేస్తోంది.
కానీ, మీడియా ఆగదు కదా.! అసలు మీడియా ఎక్కడుంది.. నడుస్తున్నదంతా మాఫియానే కదా.!
