Sobhita Dhulipala Sweet Warning.. అందాల పోటీల నుంచి సినీ రంగంలోకి వచ్చిన ముద్దుగుమ్మల్లో తెలుగమ్మాయ్ శోభితా ధూళిపాళ్ల ఒకరు.
చెప్పుకోదగ్గ సినిమాలేమీ చేయకపోయినా ఈ ముద్దుగుమ్మకి మంచి గుర్తింపే దక్కుతోంది.
ఆ స్థాయిలో గుర్తింపు దక్కించుకోవడానికి కారణం ఆమె ఎంచుకుంటున్న సినిమాలు ఓ కారణం కావచ్చు. అడవి శేష్ హీరోగా వచ్చిన ‘గూఢచారి’ సినిమా హిట్ అవ్వడం నటిగా కెరీర్‌కి కలిసొచ్చింది శోభితకి.
అలాగే, ఇటీవల ‘పొన్నియన్ సెల్వన్’ తదితర సౌత్ సినిమాల్లో శోభిత నటించి మెప్పించింది. సౌత్ సినిమాలతో పాటూ, బాలీవుడ్ ప్రాజెక్టులూ బాగానే పట్టేసింది.
Sobhita Dhulipala Sweet Warning.. ఇమేజ్ పెరగడానికి కారణమదేనా.?
సినిమాలతో పాటూ, వెబ్ సిరీస్‌లనూ వదిలి పెట్టడం లేదు శోభిత ధూళిపాళ్ల. ముఖ్యంగా ఈ అమ్మడి పేరు తరచూ వార్తల్లో నిలుస్తోందనే చెప్పొచ్చు.

అందుకు కారణం అక్కినేని హీరో నాగ చైతన్య. చైతూతో శోభిత రిలేషన్‌షిప్‌లో వున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయ్. సమంతతో విడాకుల అనంతరం చైతూ, శోభితతో లవ్‌లో పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్.
ఆ వార్తల కారణంగానే శోభిత పేరు ఈ మధ్య మరింతగా మార్మోగిపోతోంది.
అయితే, అలాంటిదేం లేదనీ, పనీ పాటా లేని వాళ్లే ఇలాంటి వార్తలు సృష్టిస్తారంటూ ఈ మధ్య శోభిత గుస్సా అయిన సంగతి తెలిసిందే.
Also Read: ‘గుంటూరు కారం’.! గురూజీ ఈ త్రీడీ ‘బీడీ’ సెట్టవ్వలే.!
కెరీర్‌లో ఈ స్థాయిలో నిలబడేందుకు తానెంతో కష్టపడాల్సి వచ్చిందనీ, సినిమాల్లో నటించాలన్న కోరికతో మోడలింగ్ రంగాన్ని ఎంచుకున్నట్లు చెప్పింది.
క్యూటీ స్వీట్ వార్నింగ్..
అయితే, మోడలింగ్ అంతగా సంతృప్తి ఇవ్వలేదట శోభితకు. అప్పుడు కమర్షియల్ యాడ్స్‌లోనైనా కనిపించాలని తహతహలాడిందట.
అది కూడా ఏమంత ఈజీగా దక్కలేదని చెప్పుకొచ్చింది. మిస్ ఇండియా కిరీటం దక్కించుకున్నాకే, సినిమాల్లో ఆఫర్లు వచ్చాయని చెప్పింది.
అలా వచ్చిన అవకాశాల్ని నిలబెట్టుకోవడానికి తాను పడిన కష్టం అంతా ఇంతా కాదంటోంది.

ఇప్పుడిప్పుడే కెరీర్‌లో నిలదొక్కుకుంటున్నానని తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో శోభిత చెప్పింది.
నటిగా మరిన్ని ఛాలెంజింగ్ రోల్స్ చేయాలనుకుంటోందట. ఈ లోపు అర్ధం పర్ధం లేని గాసిప్స్‌తో తన కెరీర్‌కి ఎలాంటి అడ్డంకి కలిగించొద్దని నెటిజన్లకు స్వీట్ వార్నింగ్ ఇస్తోంది శోభిత ధూళిపాళ్ల.
తాజాగా ‘పొన్నియన్ సెల్వన్ 2’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది శోభిత. ‘సితార’ అనే హిందీ సినిమాలో నటిస్తోంది. అలాగే ఓ ఇంగ్లీష్ మూవీలోనూ ఇటీవల ఛాన్స్ దక్కించుకుంది అందాల శోభిత.