Sonal Chauhan Rajamouli SSMB.. సోనాల్ చౌహన్.! కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు.! బాగా పరిచయమున్న అందాల భామే.!
అప్పుడెప్పుడో ‘రెయిన్ బో’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ కొన్ని హిట్ సినిమాల్లో నటించింది.. చాలా ఫ్లాపు సినిమాల్లోనూ నటించింది.
స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలున్నా.. ఎందుకో, దక్కాల్సిన స్టార్‌డమ్ మాత్రం దక్కలేదు. అయినాగానీ, ఫేడవుట్ అయిపోలేదు.. అప్పుడప్పుడూ మంచి ఛాన్సులు వస్తూనే వున్నాయ్.
ఏకంగా రాజమౌళి పిలిచేశాడట..
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా కాదు.. ఈసారి పాన్ వరల్డ్ సబ్జెక్ట్ చేస్తున్నాడు రాజమౌళి.

ఈ సినిమా కోసమే రాజమౌళి, హీరోయిన్‌గా సోనాల్ చౌహన్ పేరుని ఖరారు చేశాడన్నది తాజా ఊహాగానాల సారాంశం.
ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం.. అన్నట్టుంది వ్యవహారం.! ఇంకా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి మహేష్ బయటకు రానే లేదు.
‘గుంటూరు కారం’ సినిమాని మహేష్ పూర్తి చెయ్యాలి.. ఆ తర్వాత కదా, రాజమౌళితో సినిమాకి రెడీ అయ్యేది. అప్పుడే హీరోయిన్‌ని రాజమౌళి ఎలా ఖరారు చేసేస్తాడు.?
Sonal Chauhan Rajamouli SSMB.. ఏమో.. రాజమౌళి నిజంగానే..!?
మహేష్ వచ్చేలోపు.. మిగతా వ్యవహారాలన్నీ చక్కబెట్టేయాలని రాజమౌళి (SS Rajamouli) భావిస్తున్నాడన్నది ఓ వాదన. అందులోనూ నిజం వుండి వుండొచ్చు.
గతంలో పరిస్థితులు వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు. చకచకా సినిమాలు చేయాలని రాజమౌళి కూడా అనుకుంటుండొచ్చు. అలాగని, క్వాలిటీలో కాంప్రమైజ్ అవడాయన.
Also Read: పవన్ కళ్యాణ్ ‘Hungry Cheetah’.! ఏం చేసేస్తున్నావ్ సుజీత్.!
సోనాల్ చౌహన్ లక్కు తోక తొక్కినట్లే అవుతుంది ఆమె గనుక రాజమౌళి – మహేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ అయితే.!
గ్లోబ్‌ట్రోటింగ్ అనే కాన్సెప్ట్‌తో మహేష్ హీరోగా సినిమా తెరకెక్కించనున్న రాజమౌళి, ఈ సినిమా కోసం హాలీవుడ్ ఏజెన్సీల సాయం కూడా తీసుకుంటున్నాడు.
‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు సినిమాని ఆస్కార్ స్థాయికి తీసుకెళ్ళిన ఘనుడు రాజమౌళి, ఈసారి.. అంతకు మించిన విజయాన్ని అందుకుంటాడన్నది నిర్వివాదాంశం.