Table of Contents
Sreeleela Innocence.. అయ్యో పాపం శ్రీలీల.! ఈ మధ్య జెట్ స్పీడుతో దూసుకొచ్చిన ముద్దుగుమ్మల లిస్టులో శ్రీలీల పేరు కూడా ముందు వరుసలో వుంటుంది.
కానీ ఏం లాభం.! ఎంత వేగంగా దూసుకొచ్చిందో అంతే వేగంగా కింద పడిపోయింది శ్రీలీల.
శ్రీలీల నటించిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ఫ్లాప్ అవుతుండడంతో ఐరెన్ లెగ్ ముద్ర వేయించేసుకుని రేస్‌లో వెనకబడిపోయింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా శ్రీలీలే తన సినిమాలో హీరోయిన్‌గా కావాలన్నారంటే ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.
Sreeleela Innocence.. అలా దెబ్బలు పడ్డాయ్‌లే ‘స్పెషల్’గా.!
కానీ, అస్సలు లాభం లేదు. ‘గుంటూరు కారం’ సినిమాతోనే శ్రీలీలకు డౌన్ ఫాల్ మొదలయ్యింది. ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ ఫెయిల్యూర్ కాదు కాదు, డిజాస్టర్స్ లిస్టులో చేరిపోయాయ్.
ఇటీవల సూపర్ సెన్సేషనల్ మూవీగా రిలీజ్‌కి ముందు పేరు తెచ్చుకున్న ‘పుష్ప 2’ సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్‌లో నటించింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పక్కన ‘దెబ్బలు పడతాయ్‌రో..’ అంటూ మాంచి ఊపున్న మాస్ స్టెప్పులు ఇరగదీసింది శ్రీలీల.
కానీ, ఈ సినిమా రిలీజ్ టైమ్‌లో జరిగిన తొక్సిసలాట, గందరగోళం.. అల్లు అర్జున్‌పై కేసులు ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఊహూ.! ఆ రేంజ్ కాదు బాస్.!
శ్రీలీల నటించిన పాటకు ధియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చిందనుకోండి. కానీ, ‘ఫుస్ప’ మొదటి పార్ట్‌లో ‘ఊ అంటావా ఊహూ అంటావా’ అంటూ సమంత తెచ్చిన రేంజ్‌లో సంచలనాలు మాత్రం ఈ పాట నెలకొల్పలేదనే చెప్పొచ్చు.
ఎందుకొచ్చిన గోలలే అనుకున్నారో ఏమో, ఈ ఏడాది చివరిలో క్రిస్‌మస్ సందర్భంగా రిలీజ్ కావల్సిన నితిన్ – శ్రీలీల కాంబో మూవీ ‘రాబిన్ హుడ్’ రిలీజ్ వాయిదా వేసుకుంది.
ఒకవేళ రిలీజ్ అయ్యుంటే రిజల్ట్ ఎలా వుండేదో ఏమో కానీ, రిస్క్ ఎందుకనుకున్నారో ఏమో మేకర్లు క్రిస్‌మస్ రేస్ నుంచి ఈ సినిమాని పక్కకి తప్పించేశారు.
‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగులో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న శ్రీలీల గతేడాది ‘ధమాకా’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకోవడంతో ఆ క్రేజ్ నెక్స్‌ట్ లెవల్‌కి చేరింది.
వుందా మంచి కాలం శ్రీలీలకి ముందు ముందునా.!
వరుస అవకాశాలతో గతేడాది అంతా సినిమా ఏదైనా హీరోయిన్ మాత్రం శ్రీలీలే అన్న చందంగా మారింది. ‘స్కంధ’, ‘భగవంత్ కేసరి’, ‘ఆది కేశవ’, ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’.. వంటి సినిమాల్లో నటించింది.
వీటిలో ఏ ఒక్క సినిమా సినిమా శ్రీలీల రేంజ్ పెంచలేకపోయినా.. ‘గుంటూరు కారం’ సినిమా కోసం మహేష్ బాబు సరసన ఛాన్స్ కొట్టేలా చేసింది.
‘గుంటూరు కారం’ ఫెయిలైనా, ఐరెన్ లెగ్ ముద్ర వేయించుకున్నప్పటికీ.. శ్రీలీల ఖాతాలో మరిన్ని క్రేజీ సినిమాలు లేకపోలేదండోయ్.

వచ్చే ఏడాది ‘రాబిన్ హుడ్’తో పాటూ, ‘మాస్ జాతర’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి భారీ ప్రాజెక్టులున్నాయ్. చూడాలి మరి, వీటిలో ఏ ప్రాజెక్ట్‌తో శ్రీలీల సెన్సేషనల్ హిట్ అందుకుంటుందో.!
సినిమాల సంగతెలా వున్నా.. సోషల్ మీడియాలో శ్రీలీలకి వున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వెరీ లేటెస్ట్‌గా శ్రీలీల తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
ఆ ఫోటోస్‌కి నెట్టింట వస్తున్న రెస్సాన్స్ అంతా ఇంతా కాదు, రెడ్ కలర్ శారీ లుక్స్‌లో ఇన్నోసెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో శ్రీలీల కుర్రకారును తెగ కవ్విస్తోంది.