SSMB28 Nagavamsi సూపర్ స్టార్ మహేష్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా మొదటి నుంచీ ఇబ్బందులు ఎదుర్కొంటూనే వుంది. మహేష్ వ్యక్తిగత జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలు (తండ్రి కృష్ణ మరణం వంటివి) ఈ సినిమా ఆలస్యానికి కారణం.
అయినాగానీ, సినిమా అనుకున్నంత వేగంగా అయితే ముందుకు కదలడంలేదు. దాంతో సినిమాపై రూమర్స్ పెరిగిపోయాయ్.!
SSMB28 Nagavamsi నిర్మాత చెప్పిన పిట్ట కథ..
ఆకలేసినప్పుడు పిట్టలు గట్టిగా అరుస్తాయ్..అంటూ ఈ సినిమాపై వస్తున్న గాసిప్స్‌ని ఖండించారు నిర్మాత నాగవంశీ. సూపర్ స్టార్ అభిమానులు వీటిని నమ్మొద్దని అంటున్నారాయన.
మధ్యలో ఈ పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఎందుకు.?
పవన్ కళ్యాణ్ సినిమాలతో బిజీగా వుండడం వల్ల, ఎన్టీయార్‌తో యాడ్ షూటింగ్ వల్ల మహేష్ సినిమాని త్రివిక్రమ్ ఆలస్యం చేస్తున్నట్టా.?
ఏం పైత్యమిది.?
Mudra369
సినిమా చాలా బాగా వస్తోందనీ, గాసిప్స్ పట్ల తామేమీ కలత చెందబోవడంలేదనీ నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు.
అయినా, నిర్మాతకి లేని నొప్పి.. సోకాల్డ్ గాసిప్ రాయళ్ళకి ఎందుకు.? అన్న ప్రశ్న తలెత్తుతోంది. కానీ, తమ అభిమాన హీరో సినిమా ఆలస్యమవుతోంటే, అభిమానుల్లోనూ అనుమానాలు పెరుగుతుంటాయ్ కదా.!
ఎవరి గోల వారిది.! ఈ పిట్ట కథ సంగతి సరే.. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకి సంబంధించి ‘ఆల్ ఈజ్ వెల్’ అనుకోవచ్చా.?