SSMB28 Super Update.. తెలుగు సినీ పరిశ్రమలో ‘నాన్ రాజమౌళి’ రికార్డ్స్.. అని మాట్లాడుకోవాల్సి వస్తోంది. ఆ మాటకొస్తే, దేశవ్యాప్తంగా కూడా ఇదే చర్చ. ఆ స్థాయికి తన ఇమేజ్ పెంచుకున్నాడు జక్కన్న రాజమౌళి.
మహేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘SSMB28′ సినిమా గురించి నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘రాజమౌళి రికార్డుల’ ప్రస్తావన తీసుకొచ్చాడు.
ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్ళాల్సిన ‘SSMB28’ సినిమా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే.
SSMB28 Super Update లేట్ అయినా లేటెస్ట్‌గా..
కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల సినిమా సెట్స్ మీదకు వెళ్ళడం ఆలస్యమయ్యిందని నిర్మాత నాగవంశీ కూడా అంగీకరించక తప్పలేదు.
లేట్ అయినా, లేటెస్ట్‌గా వస్తామనీ.. ఈ ఏడాదిలోనే సినిమా రిలీజ్ వుంటుందనీ నాగవంశీ చెప్పుకొచ్చారు.
‘సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. రాజమౌళి రికార్డులను టచ్ చేస్తాం.. ఆ సత్తా ఈ కాంబినేషన్‌కి వుంది..’ అని చెప్పారు నాగవంశీ.
అంతే కాదు, ‘అల వైకుంఠపురములో’ సినిమాతోనూ ‘రాజమౌళి నెంబర్స్‌ని టచ్ చేయగలిగాం.. ఈసారి అంతకు మించి.. అంటున్నారాయన.
Also Read: Anupama Parameswaran: ఫాఫం.. పాపది వన్ సైడ్ లవ్ స్టోరీ.!
అసలు ఈ ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా.? రాదా.? అని మహేష్ అభిమానులు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే.
ఆ ఆందోళనకు చెక్ పెబుతూ, ‘ఈ ఏడాదే సినిమా రిలీజ్’ అంటూ అదిరిపోయే అప్డేట్ ఇవ్వడమే కాదు, రాజమౌళి రికార్డుల ప్రస్తావన తెస్తూ.. అభిమానులకి పండగలాంటి కబురు చెప్పారు నిర్మాత నాగవంశీ.
మహేష్ సరసన ‘SSMB28’ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ – రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా సెట్స్ మీదకు వెళుతుంది.